విరూపాక్ష స్వామీజీ దర్శనమ్. ది .18.01 .14.
విరూపాక్ష స్వామీజి ఈ రోజు యల్లాప్రగడ ప్రభాకర్ యింటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించారు . 30 మంది శిష్య బృందం తో వచ్చారు . వారిలో చాల నిశిత పరిశీలనా పటిమ కనబడింది . అది వారి తపస్ శక్తికి నిదర్శనం గ కనబడింది . అందరిని ప్రేమ పూర్వకముగా , ఆత్మీయముగా పలుకరించారు. చక్కని సంస్కృత సంభాషణ కలిగి ఉన్నారు , పాద పూజను సున్నితంగా కాదనుట ద్వారా తమ గురువుల పై గల భక్తీ , ప్రేమ కనబడింది . ప్రభాకర్ ను సహస్ర గాయత్రి చేయమన్నారు ,అందరికి ప్రేమతో ఆశీస్సులిచ్చారు . తద్వారా ఆగ్రహారానికి మేలు జరుగుతుందని అన్నారు . గాయత్రి మాత జపం నిజంగా ఎంతో శక్తి వంతమైనది . న గాయ త్ర్యాహ్ పరమమ్ మంత్రం (గాయత్రీ దేవిని మించిన మంత్రం లేదని ) అన్నారు మహర్షులు . నిబద్ధత, క్రమ శిక్షణ , నిర్మలత్వం . ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడే పర మాత్మ స్వరూపమ్ ఉంటుంది నిస్సందేహం గ . నేను రామ కృష్ణ మఠం వారి ప్రచురణ గ్రంధం మనసు అనేది ఒకటి యశ్వంతాపూర్ లో కొన్నాను. దాని సారాంశం అంతా శుద్ధ చైతన్య స్వరూపమైన మనసును కలిగిన వాడే దయామయుడై , సత్వగుణ సంపన్నుడై , ఆత్మ స్వరూపమ్ తెలిసికోగలుగు తాడని ఉన్నది. క్రమం తప్పని అభ్యాసమే , దీని కి పునాది అవుతున్ది. దీని లో ఆత్మను దర్శించటానికి , తద్వారా నీకు , దానికి తేడా లేదని ,( సోహం, అయమాత్మా పరబ్రహ్మ) దానికి నిరంతర ఓం కారం , లేదా యిష్ట దైవ స్మరణ గాని దోహద పడుతుందని పేర్కొన్నారు . నాకు ఆ గ్రంధ సారాంశమే స్వామీజీగా కనిపించారు.