శివాయ గురవే నమః
అమ్మను నాన్నలో .....ది. 24. 08. 14.
( వైష్ణవీ మాత ను గంగాధరునిలో )
శ్లొ. వాగార్దావివ సంపృక్తౌ ,వాగర్ధః ప్రతిపత్త యే ,
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
వాక్కును అర్ధము కలసి యున్న రీతి గా
పార్వతీ పరమేశ్వరులు కలసియే ఉంటారు .
అమ్మను నాన్నలో , నాన్నను అమ్మలో
చూడవచ్చు .
నేను హిమాలయాల్లో ఉన్న వైష్ణవీ మాతను
చూద్దామని అనుకున్నా . కాని నా శ్రేయోభిలాషులైన
భిష గ్వర్యులు మీరామెను ప్రత్యక్షంగా నేత్రాలతో చూడటం శ్రేయస్కరం కాదని , సముద్ర మట్టానికి దాదాపు 5000 మీటర్ల ఎత్తున ఉండటం వలన , మామూలు
గుండెలకే ఊపిరి అందదని , మీ గుండె రిపేరు చేయ బడింది కనుక అసలు కూడదని వారించారు . నిషేధించారు .
నేత్రాలతో చూడలేనివి ఎన్నో మనో నేత్రముతో చూడవచ్చు కదా. అందుకని గంగాధరుని వామ భాగం
మనో నేత్రం తో చూచి , అమ్మ వైష్ణవీ దేవిని దర్శించిన మానసిక తృప్తిని ,ఆనందాన్ని , పొన్దాను పైసా ఖర్చు
లేకుండా . కళ్ళ తో చూచినవి ఎప్పటికైనా మరచే అవకాశం లేక పోలేదు . ఇలా మనసు తో దర్శిస్తే ఇలలో
నున్నంత కాలం మరువలేము . ఈ భావన చ్చన్దస్సులో ఎలా ఉంటుందో నని ఆలోచన వచ్చి అమలు పరిచానంతే .
1. వాసవి, వైష్ణవీ సతి నవారిత భక్తిని దర్శనార్ధమై
దోసిలి యొగ్గి కోరితిని తోయజ నేత్రుడు గంగధారినిన్
దోసము గల్గు మీ యెడద దుస్తర పర్వత శ్రేణి మీదటన్
మోసము చేయవచ్చనుచు మోదము తెల్పరు ఖండితంబుగాన్ .
2. చక్కని యోచనన్ సలుప సాగితి నిట్టుల మానసంబునన్
ఎక్కడ జూచినన్ గలుగు నీశ్వరి రూపము భక్తి నిన్డినన్ .
మక్కువ మీర కాంచెదనుమాపతి కాయపు వామభాగమున్
దక్కును నాకు వైష్ణవి సు దర్శనమాత్రపు భవ్య భాగ్యముల్.
3 అమ్మకు మారు రూపమగు నాశ్రిత వత్సల తత్త్వ మెంతయున్ ,
చెమ్మగు కన్నులం గలిగి చిత్తము మొత్తము నామె వేడినన్
రమ్మని కౌగిలించి తనరారెడు ప్రేమను వృష్టి సేయు .. మా
యమ్మగు వైష్ణవమ్మ నిల హార్దిక భక్తిని నంజలించెదన్.
4. ఎంత చేసికొన్న నంతనె ఫలమిచ్చు , నదికమంచు కోర నర్హమగునె ,
చేయునపుడె మనము చిత్తంబు రంజిల్ల . భక్తి తత్త్వములను పరగ వలయు. .
5. చానగు వైష్ణవిన్, పరమ సాధ్విని, అంబను , విశ్వ శక్తినిన్ ,
మానస దర్శనంబు కడు మాన్యత, ధన్యత, సత్ఫలంబిడన్,
నేనటు జేసితిన్ మదిని నిల్కడ యైన సభక్తి ప్రేరణన్ .
వేనకు వేలు జోతలివె వేడ్కను నర్పణ జేతు మాతకున్ .