తెలిస్తే ఆవగింజ , తెలియకపోతే పెద్ద గుమ్మడి.
మానవుని మేథస్సునకు ఎప్పుడు ఏదో ఒక పని చెప్పాలి. ఏపని అయినా మనకు మనముగా స్వయముగా చేసుకుంటేనే ఆనందం. ఉదాహరణకు భోజనం ...మనం భోజనం చేస్తేనే రుచి తెలుస్తుంది, కడుపు నిండుతుంది. ఎవరో చేస్తే మన కడుపు నిండదు కదా! ఒకరు ఇంతకుముందు చేసినవే మనం చేస్తున్నాము. ఏదిఅయినా అనుభవైక వేద్యం కావాలి. ఆనాడే మనకు మహదానందం.సుఖం మనం సృష్టించుకొంటేనే వస్తుంది. సింహం అంతటిది కూడ వేటాడక పోతే నోట్లోకి ఆహారం రాదు.
ఈనాడు మనకు తరచూ ప్రయాణాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది చేయటానికి రకరకాలైన మార్గాలున్నాయి. 1.సొంతకారు.2. ఆటోలు.3. స్కూటీలు, హీరోహోండా వగైరాలు. కాని ఈనాడు పోటీ ప్రపంచంలోకి ఓలా, ఊబర్, లాంటి అద్దె కార్లు ఎన్నో అవతరించాయి. అవి మనం బుక్ చేసుకొంటే (ఆన్ లైన్ లో) చాల తక్కువ ఖర్చులో , ఏ.సీలో కూర్చుని హాయిగా గమ్యాన్ని చేరుకో వచ్చును. (మనం సొంత బండి మీద వెళ్లేదానికన్నా క్షేమంగా, సౌఖ్యవంతముగా ఉంటుంది.) ఈపని చేయటానికి ఎంతో పరిజ్ఞానం అక్కరలేదు. కావాల్సిన సామాను. 1.ఒక టచ్ ఫోన్, ఇంటర్నెట్ ఉన్నది.2. కొంచెం ఆంగ్ల పరిజ్ఞానం .(షుమారు 7వ తరగతి వరకు),3.కొంచెం చూపు 4.కొంచెం ముందు చూపు.5.వినకిడి శక్తి.6. క్రొత్త విషయాలు తెలిసికోవాలనే ఆసక్తి.(ఇది చాలా చాలా ముఖ్యం). కాని దురదృష్టమేమిటంటే ఇది చేయగలిగిన శక్తి కలవారు కూడ ,నిర్లిప్తతతో ముందుకు రావటం లేదు. ఆటోల సంగతి అతి దారుణం.....మీటర్ వెయ్యడు. వేసిన మీటర్ రేస్ గుర్రం స్పీడులో పోయేటట్లు చేస్తాడు. విసుక్కుంటాడు. మనం ఏదైనా మరచిపోతే ఇంతే సంగతులు. (ఆటోవాలాలు అందరు అలాంటివారు కాదు. వారిలోను కొందరు నిజాయతీపరులు ఇప్పటికి ఉన్నారు.)ఊబర్ లో ప్రయాణించేటప్పుడు మనం ఎటు వెళుతున్నామో మ్యాప్ చూపుతుంది.
నా అనుభవం పంచుకొంటాను.
మా ఇంటినుండి సిటిలో ఎక్కడి వెళ్లాలన్నా చక్కగా ఊబర్ లో బుక్ చేసుకొంటాము. ప్రయాణం కొంచెం ఆలస్యమైనా పరవాలేదనుకొంటే షేర్ బుకింగ్, లేకుంటే మామూలు బుకింగ్. నేనీరోజు స్వయంగా మౌలాలి, (పెన్షన్ ఆఫీసుకి ,లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు)వెళ్లి వచ్చాను. నాకు పోను రాను 160 రూ. అయినవి. అదే ఆటో అయితే 150+150=300.అవుతవి. న్యూ నాగోల్ నుండి మౌలాలి రైల్వే క్వార్టర్స్ వరకు.
కనుక అందరు తప్పక చైతన్యవంతులు కావాలి. ఏదైన తెలియక ముందు గుమ్మడికాయ, తెలిసిన తరువాత ఆవగింజే......డబ్బు తక్కువ సుఖమెక్కువ.
దీనిని వేరెవరైనా కూడ బుక్ చేసిపెట్టవచ్చు. చేయూతనివ్వండి..
క్రొత్తవిషయాలు నేర్చుకోవటం తప్పుగాదు. అపకారం కలిగించేవి, మన సంస్క్రతీ సంప్రదాయాలకు గొడ్డలిపెట్టుగా ఉండేవి నేర్చుకోవడం, ఆచరించడం తప్పు. జై భారత్!!!!!