వృద్ధాప్యం . కష్ట సుఖాలు.
1. ఉ . కన్నుల చూపు మందమయి కాయము శక్తి విహీనమై చనన్
దన్నును గోరుచున్న తలిదండ్రులు నిత్యపు జీవనంబునన్
వెన్నును గాచి యుండక నవీన విదేశపు డాలరొక్కటే
యున్నతమంచు నెంచి సుతులుద్ధతి చాటుట గారవంబొకో !
జగతి బ్రతుకంగ దగినట్టి జ్ఞానమిడిన
నాన్న మోమున చిరునవ్వు చిన్నవోయె
కన్ననేరంబు నిరతంబు కలచుచుండె.
3. తే. గీ . పుత్ర జననంబు స్వర్గంపు మూలమనుచు
తలచు తలిదండ్రులకు పరితాప మిళిత
జీవితంబెల్ల భారమై పోవుచుండ
ధర్మదూరుడు తనయుండు దరికిరాడు.
4. కం . వృద్ధాప్యంబున బిడ్డలు
శ్రద్ధాసక్తిన్ విశేష సౌఖ్యం బీయ
న్నిద్ధాత్రి వారి మీరిన
సిద్ధాత్ముల జూడగలమె శ్రీ రఘు రామా !
5. సీ . మీరటు లొంటరై మితిమీరు కష్టాల
పడవద్దు రమ్మంచు పజ్జ జేర్చి
ఆస్థుల నమ్మించి అనునయ మొప్పార
నేజూతు మిమ్మంచు నియతి బల్కి
సిరులెల్ల తన చెంత జేరిన వెంటనే
శరణాలయంబున జక్కఁజేర్చి
అమెరికా మున్నగు నన్య దేశాలకు
కులుకుచు పరుగిడు కొడుకులున్న
తే. గీ . తల్లి దండ్రుల దుర్గతుల్ తలపనేల
మానసికమైన క్షోభకు మారు పేరు
కష్ట నష్టాల కడలికి కాపువారు
కలలు చెదిరిన దీనులు కన్నవారు
6. ఉ. వేయికి నొక్కరిద్దరటు వేరుగ పుత్రులు కల్గవచ్చులే
స్థాయికి మించు యోచనలు సల్పక తల్లిని తండ్రి సద్గురున్
పాయక ప్రేమ జూచుచును భక్తి విశేష సమాదరంబుచే
తోయజనాభు సత్కృపను తోరముగా నిల బొందు సన్మతుల్
4. కం . వృద్ధాప్యంబున బిడ్డలు
శ్రద్ధాసక్తిన్ విశేష సౌఖ్యం బీయ
న్నిద్ధాత్రి వారి మీరిన
సిద్ధాత్ముల జూడగలమె శ్రీ రఘు రామా !
5. సీ . మీరటు లొంటరై మితిమీరు కష్టాల
పడవద్దు రమ్మంచు పజ్జ జేర్చి
ఆస్థుల నమ్మించి అనునయ మొప్పార
నేజూతు మిమ్మంచు నియతి బల్కి
సిరులెల్ల తన చెంత జేరిన వెంటనే
శరణాలయంబున జక్కఁజేర్చి
అమెరికా మున్నగు నన్య దేశాలకు
కులుకుచు పరుగిడు కొడుకులున్న
తే. గీ . తల్లి దండ్రుల దుర్గతుల్ తలపనేల
మానసికమైన క్షోభకు మారు పేరు
కష్ట నష్టాల కడలికి కాపువారు
కలలు చెదిరిన దీనులు కన్నవారు
6. ఉ. వేయికి నొక్కరిద్దరటు వేరుగ పుత్రులు కల్గవచ్చులే
స్థాయికి మించు యోచనలు సల్పక తల్లిని తండ్రి సద్గురున్
పాయక ప్రేమ జూచుచును భక్తి విశేష సమాదరంబుచే
తోయజనాభు సత్కృపను తోరముగా నిల బొందు సన్మతుల్