నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
21, డిసెంబర్ 2013, శనివారం
2, నవంబర్ 2013, శనివారం
దివ్య దీపావళి శుభాకాంక్షలు
చెడుగు చీకట్ల నిరతంబు చీల్చివేయు 3.11.2013.
వెలుగు రేఖలు జీవన వేల్పులనగ
మాన వాళి కి లభియించె మహితగతిని
దివ్యదీపావళింటింట తేజమలర .1.
రాక్ష సంబైన పనులకు శిక్ష నునిచి
రమ్య ,సౌజన్య భావాలు రాణకెక్క
మహిని నరకుని నరకి మాన్య సత్య
కంట కంబును దొలగించె వింటి చేత 2
.
. దీపమన్దున శ్రీలక్ష్మి దేవి యుండి
పాప హరణంబు గావించి పరమ పుణ్య
హేతు వగచును ప్రజలెల్ల హేల మెలగ
వరము లిచ్చును క్రీగంటి కరుణతోడ 3.
వెలుగు రేఖలు జీవన వేల్పులనగ
మాన వాళి కి లభియించె మహితగతిని
దివ్యదీపావళింటింట తేజమలర .1.
రాక్ష సంబైన పనులకు శిక్ష నునిచి
రమ్య ,సౌజన్య భావాలు రాణకెక్క
మహిని నరకుని నరకి మాన్య సత్య
కంట కంబును దొలగించె వింటి చేత 2
.
. దీపమన్దున శ్రీలక్ష్మి దేవి యుండి
పాప హరణంబు గావించి పరమ పుణ్య
హేతు వగచును ప్రజలెల్ల హేల మెలగ
వరము లిచ్చును క్రీగంటి కరుణతోడ 3.
21, అక్టోబర్ 2013, సోమవారం
మధురాను భూతి .
మధురాను భూతి . 20. 10. 13.
బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని ప్రత్యక్షంగా చూడటమే ఒక మహత్తర దివ్యాను భూతి . వారితో మాట్లాడటం మరువలేని మధురాను భూతి . వారిరువురు ( దంపతులు ) పార్వతీ పరమేశ్వరుల ప్రతి రూపమ్ . నేను వారిని గురించి పద్యాలు వ్రాయటం చాల ఆనంద దాయకం . జన్మ తరించి నట్లుగా భావిస్తాను . వారి పురాణ ప్రవచనమునకు వయస్సు సప్తతి (70. సం .లు ) ఈనాటికి వారి వయస్సు 90 వసన్తాలు. స్వరం ఆనాటికి ఈనాటికి ఏమి తేడా లేదు . సాక్షాత్ వాల్మీకి , వ్యాస ముని రూపమె. ఈనాడు వారికి సువర్ణ పుష్ప సహిత రజత కిరీటం ( ప్రభాకరశర్మ, సుధారాణి చేత )అలంకరించటం జరిగిన్ది. తదనంతరం వారిని గురించిన పద్యాలు చదివి వినిపించడం , దానికి వారు మహదానంద భరితులు కావడం , ఆ సందర్భం గ వారితో మాట్లాడటం పురాకృత పుణ్య విశేషంగా భావిస్తాను .
ఈ మహత్తర అవకాశం నాకు చి. ప్రభాకర శర్మ ద్వారా లభించిన్ది. ఆనాటి సభానిర్వాహకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు.( సినీ కవి .) ప్రధమంగా నా పద్యాలు వారికి చదివి వినిపించాను. నేను పద్యాలు వ్రాద్దామని అనుకున్నాను . మీ పద్యాలు విన్నతరువాత అభిప్రాయం మార్చుకొన్నాను మీ పద్యాలు చాలా బాగున్నాయి వానినే అచ్చు వేయించి సమర్పించండి అని చెప్పటం నాకు మహదానందం కలిగించింది . పద్యాలు చదివిన తరువాత విభీషణ శర్మ గారు, ( తి . తి .దె . సాహితీ కార్యక్రమ నిర్వాహకులు ) వల్లూరి శంకర శాస్త్రి గారు ( తి . తి .దె . ప్రముఖులు ) చాల మంచిపద్యాలు బాగా చదివారని ఆశీస్సులన్దించటం
మిగుల ఆనందాన్ని కలిగించిన్ది. ఇంతటి మహనీయుడు పుట్టిన అమరావతి కి ( గుంటూరు జిల్లా) సమీపంలోనే నేను జన్మించడం నా భాగ్యమ్.

19, అక్టోబర్ 2013, శనివారం
15, అక్టోబర్ 2013, మంగళవారం
అక్షర నీరాజనం 20. 10. 2013
అభి నవ వ్యాస , సవ్య సాచి . బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి . యల్లాప్రగడ ప్రభాకర శర్మ గారి చేత
20. 10. 2013 న సన్మాన కార్య క్రమము . ( సువర్ణ పుష్పసహిత రజత
కిరీట ధారణ )
అక్షర నీరాజనం
1. సి. కృష్ణా జలంబు లు తృష్ణ దీరగ ద్రావి ,
వేద సారము పంచు విజ్ఞు లెవరు
వైదిక జ్ఞానియై వాదనన్ గెలువంగ
తాత చైనుల మేధ తరచే నెవరు
కమ్మని స్వరమున కవితా ఝరులిల
ధారలై పొంగించు దాత ఎవరు
తే . గీ . వారలెవ్వరొ కాదుసు వసుధ యందు
చంద్ర శేఖర శాస్త్రి నాన్ చదువులయ్య
బ్రాహ్మి పుంభావ రూపంబు వాస్తవముగ
పాద పద్మంబు లర్పించి ప్రణతు లిడుదు
8, సెప్టెంబర్ 2013, ఆదివారం
ప్రకృతి పురుషుల ఆరాధనే . వినాయక చతుర్థి. .
ప్రకృతి పురుషుల ఆరాధనే . వినాయక చతుర్థి. .ప్రకృతి పురుషులు వేరెవరో కాదు . ( ఆది దంపతు లైన
పార్వతీ పరమేశ్వరులు )
శ్లో . వాగర్దా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతి పత్తయే ,
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ .
ప్రకృతి, పార్వతి. పురుషుడు పరమశివుడు . ఈ సత్యాన్ని నమ్మిన వాడే మనవినాయక స్వామి. అందుకనే కుమార స్వామి కి తనకి వచ్చిన సేనా నాయకత్వఆధిపత్య పోరులో విజయం కొరకు అతి సులువైన మార్గాన్ని తన తండ్రి అయినపరమేశ్వరుని ద్వారా తెలిసికొన్నాడు . అదే తల్లి దండ్రులకు సభక్తిక ప్రదక్షిణము.
కుమారస్వామికి తాను స్నానం చేసిన మూడు కోట్ల ఏబది లక్షల నదులలో
తన అన్నగారు ముందుగా స్నానం చేసినట్లు కనిపించాడు . దానికి కారణం
తెలియక విస్తుపోయాడు ,కుమారస్వామి. సూక్ష్మం లో మోక్షం గ తలిదండ్రులకుప్రదక్షిణం చేసి విజయం సాధించి , సర్వ సైన్యాధి పత్యాన్ని , సంపాదించాడు తెలివిగావినాయక స్వామి. కనుక పార్వతీ పరమేశ్వరుల వంటి తలిదండ్రుల పూజ మహోన్నత మైనదనినిరూపించాడు బొజ్జ గణపతి. సమాజ శ్రేయస్సుకు ఇంతకన్నా కావలసింది ఏముంటుంది .
ఇక పత్రీ , పూజా ద్రవ్యాలు గురించి ఆలోచిస్తే . ఆయన కిష్టమైనది ముఖ్యం గ గరిక. దీనితో పూజిస్తే , సమస్త పూజా ద్రవ్యాలతో, పత్రులతో పూజించినట్లే .ఎక్కువ ధనం వెచ్చించకుండా సామాన్యుడుకూడాసులువుగా పూజించే విధం గ ఏర్పాటు చేసినదే గరిక పూజ. కాని మనం సమస్త ఆయుర్వేద శక్తులు దాగి ఉన్న 21 పత్రాలతో పూజిస్తె ఆరోగ్య పరంగా , ఆధ్యాత్మిక పరంగా మంచిదని విజ్ఞులు చెప్పటం వలన ఆయా పత్రాలను సభక్తి కముగా సేకరించి పూజిస్తాము. ఈ విధంగా మనం నిర్మల భక్తి తో పూజ చేస్తే మన హృదయసరోవరంలోనే విహరిస్తాడుబుజ్జి ( బొజ్జ ) గణపతి .
ప్రతి పూజలో లౌకికము , పార లౌకికము ఉంటాయి . మట్టి తో చేసిన గణపతికి పూజ చేసి, నిమజ్జనం చేస్తే ,ప్రకృతి , ప్రకృతి లో కలసి పార లౌకికత సిద్ధిస్తున్ది. కనుక మనమందరం అవకాశం మేరకు మృణ్మయ గణపతినేత్రికరణ శుద్ధిగా పూజ చేసి మనోభీస్టాలను సిద్ధింప జేసుకొందాము .
శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు .

20, ఆగస్టు 2013, మంగళవారం
"అన్నా అంటే నేనున్నా "
శ్రావణ పూర్ణిమ , జంధ్యాల పూర్ణిమ , రక్షాబంధన్, రాఖి.
ఈ పేర్లన్నీ చెల్లికి మానసిక బలాన్నిచ్చే చర్యకి ప్రతి రూపాలె. సృష్టిలో
ప్రేమ పాత్ర ఎంతో ఎవరికీ చెప్పనక్కరలేదు . భార్యా భర్తలు, అన్నా. చెల్లెలు. అక్కా,తమ్ముడు ఇలా ఎన్నో సంబంధాలు .
దేనికదే పవిత్రమైనది. విలువైనది. ఆ విలువలు నిలబెట్టుకోవా
లంటే కొన్నిసామాజిక ధర్మాలు పాటించాలి . అన్నా, లేక తమ్ముని క్షేమం కోరి ఒక చెల్లి ,లేక అక్క బంధనాన్ని చేతికి కట్టడమే రక్షా బంధనం . దాని ద్వారా అన్న ,చెల్లికి అభయమిస్తాడు . మనం ముందుగా రక్తం పంచుకొని పుట్టిన వారికైనా ఇలాంటి రక్షణ కల్పించ గలిగితే ఆ తరువాత" అన్నా" అని పిలిచే ఏ చెల్లి కైనా చేయ గలుగుతాము. అందుకే ప్రతి ఆడ పిల్ల తనకు పరిచయమైన పరాయి పెద్ద మగ పిల్లలను అన్నా అని పిలుస్తున్ది. అది మన సంప్రదాయం . దీనిని గుర్తు చేస్తుంది మహా భారతమ్.ద్రౌపది కష్టకాలంలో కృష్ణా , అన్నా అని పిలిచి తన మానాన్ని కాపాడు కొంటుంది . సమాజంలోని సంబంధాలు బలపడాలి , విదేశీ యులకు మనం ఆదర్శం కావాలి అంటే తప్పక కొన్ని ఉత్తమ ధర్మాలను ఆచరించాలి. "అన్నా అంటే నేనున్నా " అనే సద్భావన కలిగిస్తూ వ్యక్తిత్వం పెంచు కోవాలి . ఆనాడే మనం అన్ని విజ్ఞాన సౌధాలు ఎక్కినట్లు . ఇవి లేకుంటే అజ్ఞాన అంధకారంలో దిగజారినట్లు . కాదంటారా .

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.
ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1 సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...
-
షష్టి పూర్తులు , సహస్ర చంద్రదర్శన శాంతిహోమాలు అవసరాలా ? ఆడంబరాలా ? ప్రపంచ దేశాలు మన దేశానికి మోకరిల్లేది మన ఆర్ధిక సంపదను చూ...
-
చెడుగు చీకట్ల నిరతంబు చీల్చివేయు 3.11.2013. వెలుగు రేఖలు జీవన వేల్పులనగ మాన వాళి కి లభియించె మహితగతిని ...
-
కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా. ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మ...