19, నవంబర్ 2014, బుధవారం

అవధాన రాజధానీ ,నిషిద్ధాక్షరి, గీతం.

        ది. 2. 11. 14 నుండి 9. 11. 2014 వరకు . అవధాన రాజధానీ 

.           ఈ కార్యక్రమం మహోన్నతంగ  భారత దేశ రాజధాని అయిన డిల్లి మహానగరం లో  ద్వి సహస్రావధాని ,డా . మాడుగుల నాగ ఫణి శర్మ గారి చే నిర్వహించబడింది . పృచ్చకులసంఖ్య 250.  ఉత్తర,దక్షిణ  ప్రాంత సంస్కృత కవులు , పండిత ప్రకాండులు కళాకారులు , రాజకీయ నాయకులు  ఎందరో పాలుపంచుకొన్నారు ఎందరో మహాను భావులు . అందరికి వందనాలు .  . 
   
  దీనిలో ముఖ్యముగా 1. సమస్య . 2. దత్త పది . 3. నిషిద్ధాక్షరి 
4. వర్ణన  5 . అశువు   6. మీమాట ..నా పాట . 7. నృత్య పది . 
8. స్వర పది . 9. చిత్ర పది.అనే  అంశాలు ఉన్నాయి. 

అన్ని అంశాలు మనోహరం గ మనో రంజకం గ సాగినవి. నేను 

నిషిద్ధాక్షరి లో పాలు పంచుకొన్నాను నిషిద్ధాక్షరి అవధాని గారికి  పృచ్చకునకు మధ్యన జరిగే సాహిత్య (తో )రణం.  దీనిని 
పద్య రచన చేయగలిగిన వారు మాత్రమే ఆనందించ గలుగు తారు. 
తదన్యులు ప్రయత్న పూర్వకముగా ఆనందించగలరు . 

   సాధారణం గ అవధాని పద భాండాగారము . పదకొశమును యెదలో నిత్యం మననము చేస్తూఉంటారు  అందువలన  పై చేయి వారిదే నిస్సందేహంగా . ఇందు  పృ చ్చకుని పద, పద్య , భావ పాండిత్యము , కూడా పని చేస్తుంది . దాని వలన అవధాని గారిని కొంత వరకు యిబ్బంది పెట్ట వచ్చు . 

విషయము .     సంగీతము . రొగనిర్మూలన కారిణి . 


 కంద పద్యము .  ( పాద ప్రారంభములో యతి ఉంటుంది కనుక అవధాని గారే ప్రారమ్భిస్తారు. )

కం    (అవధాని గారు ) భో గా () ( నిషేధం) ( ఆవ  ) ( నిషేధం) ( ఆవ ) సం ( నిషేధం ) మీ ( ఆవ)రా (నిషేధం ) గా ( ఆవ) త్రం ( నిషేధం ) నం ( ఆవ)

    (ఆవ) బాగా  న (నిషేధం )ధం ( ఆవ) తె ( నిషేదం  ) జె ( ఆవ) వి ( నిషేధం) ప్ప ( ఆవ) వి (నిషే )రో ( ఆవ )
       గా (నిషేధం ) (ఆవ) సాం  ( ఆవ) యతి స్థానం కనుక వారె ప్రయోగం . ( నిషేధం ) ( ఆవ) ము (నిషే)
       ర ( ఆవ) స్థి (నిషే) ( ఆవ) (నిషే) తి ( ఆవ) గా (నిషే ) యౌ (అవధాని )

కం .భోగాయతమీ గానం , బా గాధం జెప్ప రోధసాంతరదతియౌ

 (ఈ రీతిగా రెండు పాదములు నిషేధ, నిక్షిప్తాలతో సాగినది.  మిగిలిన రెండు పాదములు ఈ విధం గ ఊహించి వ్రాయడమైనది . )

   రాగార్చితంపు దైవము , సాగున్ వైద్యంబు పగిది స్వాస్త్యము  గూర్పన్

అవధాన   రాజధాని బ్రహ్మశ్రీ నాగ ఫణి శర్మగారి చేత విజయవంతమ్ చేయబడినది. నేను నిషిద్ధాక్షరిలో పాల్గొన్నాను . చాలా  చక్కని  పద్యం  వచ్చింది . 

విషయం ..  సంగీతం .  రోగ నిరోధకం . 

కం .  భోగాయతమీ గానం 
        బాగాధం జెప్ప రోధసాంతర దతియౌ . ( ఈ రెండు పాదములు నాగఫణి గారు చెప్పినవి )
        రాగార్చితంపు దైవము , 
        సాగున్ వైద్యంబు పగిది సౌమ్యత గూర్పన్. ( ఈ రెండు పాదాలు నేను ఊహించి వ్రాసినవి )

నాగఫణిశర్మ గారిని అభినందిస్తూ వ్రాసిన గీతమ్.

పల్లవి ..  నలువ రాణి పాదమణి   , నాగఫణి  మీరు  . 
             పలుకులమ్మ పనుపున , నిల దిగిన సౌరు. 

చరణమ్ .రాజధాని నంత రస రమ్యం జీసి  
             కళల సారమెంతెంతో కలగలుపుగ నేసి
             అసమానపుటనురాగం అందరకు పంచి 
             కవి, పండిత, చిత్రకార,గాయకాళి రప్పించి .               
                                      
                                     నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.

ప.         దిల్లి ప్రభుత కవితకున్న ప్రాముఖ్యం దలచి 
            తల్లివోలె తపన తోడ తనవద్దకు పిలచి 
             వినిపించెను వినువీధిని విమల తెలుగు కవిత 
             వ్యాపించును తరతరముల జిలుగు వెలుగు భవిత .
      
                                   నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

చ.        క్రొత్త పుంత  త్రొక్కుట క్రొత్త మీకు కాదు . 
            అవధానము , ధారణంబు  వింతేమి కాదు . 
            కుంచె వెంట కూర్చుపదము కోరుకున్న కూర్మిపధము 
            నృత్త పదము , నృత్య పదము నవ్య పధం మీకు .      
                       
                                నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

ప.       సంస్కృతంబు , రాజ భాష  సవరించిన గళము 
           ప్రకటించును స్వారస్యము మీదు పొన్ను కలము 
           కవిత మీకు బలము , రసము మాకు ఫలము 
           నవ రసాలు చిలుకుటే నవ్య వరము మాకు .

                                నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

                              
     




       





15, అక్టోబర్ 2014, బుధవారం

విశ్వ ప్రయత్నమే విజయ హేతువు .

                                విశ్వ ప్రయత్నమే  విజయ హేతువు .                                                                                      ఈ రోజు నాకు చాలా  సంతోషం గా ఉన్నది . రాధి వాళ్ళ టాబ్ నుండి తెలుగులో టైప్ చేస్తున్నాను . సాధనే సర్వతో ముఖ విజయ హేతువు . కిరణ్ పుట్టిన రోజు సందర్భం గా ఒక ఫోటో మీద వాడికి  శుభాకాంక్షలు పంపా ను . అది  వాడికి చాలా బాగా నచ్చింది . ఈ టాబ్ లో చాలా సమయం వరకు తెలుగులో టైపు చేయటానికి రాలేదు . అయినా నా ప్రయత్నం వదల లేదు . విశ్వ ప్రయత్నమే
 విజయ హేతువు . 

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

బీదర్ లోని లక్ష్మీనరసింహ స్వామీ ఆలయ దర్శనం . ది 30.. 14

             బీదర్ లోని లక్ష్మీనరసింహ స్వామి  ఆలయ దర్శనం .ది 30.09 . 14 

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రవేశం ఒక ప్రత్యేక మైనది . తాండూరు లోని 
ద్వాదశ శివ క్షేత్రం సుప్రసిద్ధము  . ఎందుకనగా పరమ శివుని దర్శించటానికి 
భక్తులు కొంత దూరం నీటి లో నడవాలి . ఆ నీరు షుమారు రొమ్ముబంటి ఉంటాయి . ఇష్టమైన  వారు నీటిలో వెళ్ళుట , అలా వీలుకాని వారు వేరే విధం గ వెళ్ళుట జరిగి మొత్తానికి శివ దర్శనము చేసికొన వచ్చును, 
               
కాని బీదర్ లో మాత్రం తప్పక నీటిలో వెళ్లి మరల నీటిలో నుంచే రావాలి. ఆ నీరు మొలబంటి ఉన్నాయి .వయసు యెంత అయిన ఎవరికి వారికి రొమ్ము బంటే నీరు వస్తాయట . అదే నరసింహ స్వామి మాహాత్మ్యమట . కాని ఈ రోజు మాత్రం నీరు కటి బంటి  మాత్రమె ఉన్నాయి .  ఏ రకమైన యిబ్బంది లేకుండా మేమందరము  స్వామిని దర్శించుకొని వచ్చాము . చాల ఆనందం గ ఉన్నది. 101 అంటి గారి భర్త గారిని కూడా జాగ్రత గ తీసికొని వెళ్లి తీసికొని వచ్చాను. ఆయన ఉబ్బసము తో బాధ పడుతున్నారు . కాని వెళ్లి రావటం లో ఏ యిబ్బంది పడలేదు . 

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

అన్నమయ్య సంకీర్తనల కార్య క్రమం

ది. 26..09. 14. న అన్నమయ్య సంకీర్తనల కార్య క్రమం చాల బాగా జరిగింది . కీర్తనలకు చేసిన వివరణ అందరికి నచ్చింది . 

25, సెప్టెంబర్ 2014, గురువారం

దసరా ది. 26..09 . 14 న కార్యక్రమము .

           శరన్నవ రాత్రి ఉత్సవముల సందర్భముగా .( దసరా) ది. 26..09 . 14 న కార్యక్రమము .

               శ్రీమాన్ మరింగంటి రాఘవాచార్యుల  వారితో ( అష్ట లక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు ) పరిచయం.  (ది. 24. 09. 14 న )

   దేవాలయ ప్రాంగణం లో ది. 26. 09. 14. ఉదయము 8. గం .లకు శ్రీమతి  వి. వి. యస్. కృష్ణ  కుమారి , మరియు  శ్రీమతి  పద్మ లత గారు  అన్నమాచార్యుల వారి కీర్తనలు  పాడుటకు  అనుమతి లభించింది . కృష్ణ కుమారి గారు కీర్తన లకు వ్యాఖ్యానం ఉంటే  బాగుంటుందనే ఆలోచన వచ్చి నన్ను చెప్పమని అడిగారు . నేను

అంగీకరించాను . వారి కీర్తనలకు అనుగుణం గ విషయం వ్రాసుకొన్నాను . ఈ రోజు ఆచార్యుల వారి దగ్గర కొంత అభ్యాసం చేయాలని విషయం వారికీ చూపించాలని అంటే వారి యింటికి వెళ్ళాము . నేను వ్రాసిన దానిలో అన్నమయ్య గారిని గురించి కొంచెం తగ్గించి చెప్పమన్నారు . మిగిలినది అంతా బాగున్నది అని అన్నారు . చాలఆనందం గ ఉన్నది. కార్య క్రమం 
విజయవంతమైతే యింకా ఆనందం . క్రొత్త క్రొత్త అనుభవాలు వస్తున్నాయి . 
అయాచితం గ వచ్చే అవకాశాలే మధురానుభూతులను యిస్తాయి . విలువలను పెంచుతాయి. 

.

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

గురు పూజోత్సవము సందర్భముగా 5.09.2014.

 (గురు పూజోత్సవము సందర్భముగా


శ్లో.  గురుర్ బ్రహ్మ , గురుర్ విష్ణుః , గురుదేవో మహేశ్వరః
       గురుస్సక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః . )

  శ్లో. అజ్ఞాన తిమిరాన్ధస్య జ్ఞానాం జన శాలాకయా
      చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః .

     మాతృ దేవో భవ, పితృ దేవో భవ ,ఆచార్య దేవో భవ, అతిధి దేవో భవ .

     జన్మ నిచ్చిన తల్లి ప్రధమ గురువు . నడక నేర్పిన తండ్రి ద్వితీయ గురువు .నడత నెర్పుతూ , జ్ఞాన భిక్ష పెట్టె వారు త్రి గుణ రూపులైన వారు తృతీయ  గురువులు. భగవత్ స్వరూపులైన  వారు , హిందూ సంప్రదాయానికి ప్రతీకలైన వారు, తురీయ గురువులు .                         ఎందరో మహాను భావులు అందరికి వందనములు .

  అకలంకంబగు నక్షరంబులను , సర్వార్ధ్హార్ధ సిద్ధం బుగాన్ ,
  సుకరం బయ్యెడి రీతిగా  మదికి సంస్తూయాత్మ పాండిత్యమున్,
  సకలంబున్ దయ జూపి నేర్పిన గురుస్స్వాముల్ విచారింప ..నా
  కొకరా యిద్దర ముగ్గురా నలుగురా ఉన్నార లెందెందరో  .

28, ఆగస్టు 2014, గురువారం

శారద నీరదేందు





శారద నీరదేందు ....పద్య ప్రతి పదార్ధం.  శారద = శరత్కాలమన్దలి, నీరద =మేఘము , ఇందు=చంద్రుడు , ఘనసార =కర్పూరము , పటీర =పటిక, మరాళ=హంస , మల్లికాహార =మల్లెల దండ , తుషార =నీటి తుంపర , ఫేన =నురుగు , రజత +అచల = వెండికొండ , కాశ=రెల్లుగడ్డి ,ఫణీశ =నాగేంద్రుడు , కుంద=మల్లె , మందార =తెల్ల మందార ,సుధా పయోధి = పాల సముద్రము , సిత=తెల్లని , తామరస =తామరపువ్వు , అమర వాహిని = గంగానది , వలె, శుభ ఆకారతన్= ఆకారముతో , ఒప్పు =ప్రకాశించు , నిన్ను, మదిన్ =మనసులో , ఎప్పుడు , కాన గల్గుదు , భారతీ .

 పోతనామాత్యులు అన్ని తెల్లని రంగు గలిగి వానితో సరస్వతిని పోలుస్తూ మనోహరంగా వర్నిచిన పద్య రత్నము .  

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...