౧. తెలుగుపద్యాలు చదివిన తేనెలూరు
తెలుగుపద్యాలు సర్వదా ధిషణ పెంచు,
తెలుగు పద్యాలు నిరతంబు ధైర్య మిచ్చు .
తెలుగుతనమది ఆధ్యాత్మ స్థితిని బెంచు.
౨. తెలుగు వెలుగులు గగనాన వెలుగవలయు.
తెలుగు భాషకు పట్టంబు నిలుపవలయు.
తెలుగు తెలుగంచు ప్రభుతయు మెలగవలయు.
తెలుగున కపుడె గౌరవ తీరు బెరుగు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి