పంచాంగం ఖగోళ శాస్త్రానుసారం అయిదు మహత్తర విశేషములు కలిగినది . తిది వార నక్షత్ర యోగ కరణములతో కూడి గ్రహ సంచారముల ననుసరించి వాని ప్రభావం మన పై ఎలా ఉంటుందో సూచిస్తుంది . అది ఒకప్పుడు మంచిని మరొకప్పుడు చెడును సూచిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజు అన్ని (తేది ,నెల , సంవత్సరం ) ఒకటి ( ౧ ) రావటం , ఒకటిగా రావటం మనోహరం . మరల ఇలా ౧౦౦. సంవత్సరాలకు వస్తుందట . వచ్చే జన్మలో చూడాలిసిందే. ఒకట్ల విశేషం
నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
11, నవంబర్ 2011, శుక్రవారం
9, నవంబర్ 2011, బుధవారం
కరావలంబనం
చేతల్లో చేతుల్లో , నడతల్లో నడకల్లో. .ఊహల్లో వూసుల్లో,ఆటల్లో పాటల్లో,సాహిత్యాల్లో, సౌహిత్యాల్లో , యిలలో ,కలలో . పరస్పర బంధ బంధితమై ,స్వచ్చమైనదే స్నేహబంధం .
ఆ బంధం నిరంతరం అనుబంధం కావాలి. పరస్పర అభివృదికి పునాదిరాళ్ళు కావాలి.
ఆనాడే మానవుడు మహనీయుడు అవుతాడు
.
.
హస్తి ముఖుని దీవన .
హస్తము హస్తముంగలసి హాసమునొందెడు స్నేహశీలి - ప్రా
శస్త్యముజెందుచున్బహుళ సద్గుణ దీపిత మాననీయుడౌ
సుస్తవనీయుడై సుమవికాస కళావికసన్మణే యగున్
హస్తిముఖావతంసు దరహాస విలాసపు దీవనాలిచేన్ .
హస్తిముఖావతంసు దరహాస విలాసపు దీవనాలిచేన్ .
విశ్వప్రేమ
౪. విశ్వప్రేమకు నర్హత వినయమంచు,
చాటి చెప్పిరి ఎందరో మేటి ఘనులు.
వినయ సంపన్నుడెప్పుడు వేడ్క పడును,
ప్రేమ పంచగ,పెంచగ పెన్నిధనుచు.
చాటి చెప్పిరి ఎందరో మేటి ఘనులు.
వినయ సంపన్నుడెప్పుడు వేడ్క పడును,
ప్రేమ పంచగ,పెంచగ పెన్నిధనుచు.
౫. వినయ మనయంబు విజ్ఞాన విస్తృతంబు,
వినయమొక్కటే సద్భావ విభవమగును.
ఇట్టి సద్గుణ జాలంబు పట్టువడిన,
విజయవంతంబు నిరతంబు విశ్వప్రేమ .
వినయమొక్కటే సద్భావ విభవమగును.
ఇట్టి సద్గుణ జాలంబు పట్టువడిన,
విజయవంతంబు నిరతంబు విశ్వప్రేమ .
తెలుగు వెలుగులు
౧. తెలుగుపద్యాలు చదివిన తేనెలూరు
తెలుగుపద్యాలు సర్వదా ధిషణ పెంచు,
తెలుగు పద్యాలు నిరతంబు ధైర్య మిచ్చు .
తెలుగుతనమది ఆధ్యాత్మ స్థితిని బెంచు.
౨. తెలుగు వెలుగులు గగనాన వెలుగవలయు.
తెలుగు భాషకు పట్టంబు నిలుపవలయు.
తెలుగు తెలుగంచు ప్రభుతయు మెలగవలయు.
తెలుగున కపుడె గౌరవ తీరు బెరుగు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25
1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...
-
షష్టి పూర్తులు , సహస్ర చంద్రదర్శన శాంతిహోమాలు అవసరాలా ? ఆడంబరాలా ? ప్రపంచ దేశాలు మన దేశానికి మోకరిల్లేది మన ఆర్ధిక సంపదను చూ...
-
వదలకయ్యగురువు పాదములను. ( ఆటవెలదుల శతకము) బ్రహ్మవిష్ణుభవుల భాసురతేజంబు మూర్తిగొన్న రూపు పుడమికాపు గురుపదమ్మె సుమ్ము! గోప్యంబులేదురా వదలకయ్య...
-
శ్రీరామ శతకము.... **కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!**మకుటంతో శ్రీరామ శతకము...పొన్నెకం...