నిషిద్ధాక్షరి 2.
9. పృ :- ఓం ప్రకాష్ .
వి :- అవధాన సరస్వతిని వర్ణించుట .
కం . జయ భారావన గురుమతి ,
నయ మేలన సుపధ పద్య నవ్యాంగీ -నీ
దయ వలన పలుకుచుంటిని
జయ ధారా ధారణా ప్రసారా సారా !
10. పృ :- వేదాద్రి చంద్ర శేఖర శాస్త్రి .
వి :- లేపాక్షి ప్రాశస్త్యము . ( రాముడు, సీత ,లక్ష్మణుడు ,రావణుడు ,జటాయువు పదాలు నిషేధం )
కం . ఆపగిది నరణ్యము లో
శ్రీపతి కరుణించి చూచి చేరెను పక్షిన్
లే పక్షీ యని పిలువన్ ,
లేపాక్షిగ పేరు వచ్చెలే జగమందున్ .
11. పృ :- భాస్కర సీతారామ ప్రసాద్ .
వి :- శ్రీ కృష్ణ దేవరాయలు గూర్చి , అష్ట దిగ్గజముల పేర్లు నిషేధం ,
తే . గీ . అష్ట దిగ్గజ కవులకు నిస్టు డగుచు
చెలగి సాహిత్య జగతి విశిష్ట్టు డయ్యె,
కృష్ణ రాయలు శ్రీ మత్కవీశుడయ్యె
క్రమత సాహిత్య సమరాంగణముల నేలె
12. పృ :- శ్రీ మతి లలితా పరమేశ్వరి .
వి :- సరస్వతీ నదీ పుష్కరాలు .
కం . పుష్కర హేలార్థ ధునీ ,
నిష్కార్యారంభ శిఖ వినీయ మతి శ్రీం
విష్కంభ నాట కీశో
చిష్కేశానుగ్రహబల సిద్ధము కవితన్ .
13. పృ :- కె. రమాదేవి .
వి :- వామనావతార వర్ణన (" డ" నిషేధం )
కం . కోరగ పద త్రయంబును
శౌరియె వామనత వచ్చె సాధు అనంగా
ధారాళముగా నిచ్చెను
శ్రీ రమ్యము బలివదాన్య శిష్ట చరిత్రల్ .
14. పృ :- మరుమాముల దత్తాత్రేయ శర్మ .
వి :- సరస్వతీ పుష్కరాలు . ( కాళేశ్వర క్షేత్రం , శివ నామము నిషేధము ..)
కం . కాళేశ్వర! ముక్తీశ్వర !
లీలా వైభవము పుష్కరీ రమ్యంబౌ
మాలా సరస్వతీ హిత
మూలము వాక్ మయము నందు మునుకలు వేయన్ .
15. పృ :- డా . రఘురామ శర్మ .
వి :- మధ్యమావతి రాగ వర్ణన . ( ఈ రాగం లో ద, గ, ఉండక పోవటం దీని విశిష్టత )
కం . ద ,గ, లేనిది ఒదిగినదిది
నిగళంబే కాని రాగ నీతాధ్వర - శో
భగ మంగళ రస శిఖరము
భగవానుని పొగడు పగడ పసిడి యిదియగున్ .
16. పృ :- శ్రీమతి ప్రభల జానకి .
వి :- వేటూరి ప్రభాకర శాస్త్రిగారి 120 వ జయంతి , అన్నమయ్య జయంతి వర్ణన . అ, న, నిషిద్ధం .
కం . పద కవితకు పెద తండ్రిగ.
పద పదముల వేంకటేశ భక్తి పథమ్బై
పదవీ శ్రీ పతి కొలువై
సదమల వాక్ మయములందు శాశ్వతుడు కదా .
17. పృ :- విశ్వనాథ శర్మ .
వి :- అవధాన వైభవం . " అవధానపదం "నిషేధం .
కం . ఏకాగ్ర మనేకాగ్రము ,
శ్రీ కావ్యాక్షర సుదీక్ష చిర ధారణ గా
ఆ కోకిల యగు భారతి ,
శ్రీ కల్పన లాశుగతిని చిత్రించె నిటుల్ .
సశేషం .
వి :- లేపాక్షి ప్రాశస్త్యము . ( రాముడు, సీత ,లక్ష్మణుడు ,రావణుడు ,జటాయువు పదాలు నిషేధం )
కం . ఆపగిది నరణ్యము లో
శ్రీపతి కరుణించి చూచి చేరెను పక్షిన్
లే పక్షీ యని పిలువన్ ,
లేపాక్షిగ పేరు వచ్చెలే జగమందున్ .
11. పృ :- భాస్కర సీతారామ ప్రసాద్ .
వి :- శ్రీ కృష్ణ దేవరాయలు గూర్చి , అష్ట దిగ్గజముల పేర్లు నిషేధం ,
తే . గీ . అష్ట దిగ్గజ కవులకు నిస్టు డగుచు
చెలగి సాహిత్య జగతి విశిష్ట్టు డయ్యె,
కృష్ణ రాయలు శ్రీ మత్కవీశుడయ్యె
క్రమత సాహిత్య సమరాంగణముల నేలె
12. పృ :- శ్రీ మతి లలితా పరమేశ్వరి .
వి :- సరస్వతీ నదీ పుష్కరాలు .
కం . పుష్కర హేలార్థ ధునీ ,
నిష్కార్యారంభ శిఖ వినీయ మతి శ్రీం
విష్కంభ నాట కీశో
చిష్కేశానుగ్రహబల సిద్ధము కవితన్ .
13. పృ :- కె. రమాదేవి .
వి :- వామనావతార వర్ణన (" డ" నిషేధం )
కం . కోరగ పద త్రయంబును
శౌరియె వామనత వచ్చె సాధు అనంగా
ధారాళముగా నిచ్చెను
శ్రీ రమ్యము బలివదాన్య శిష్ట చరిత్రల్ .
14. పృ :- మరుమాముల దత్తాత్రేయ శర్మ .
వి :- సరస్వతీ పుష్కరాలు . ( కాళేశ్వర క్షేత్రం , శివ నామము నిషేధము ..)
కం . కాళేశ్వర! ముక్తీశ్వర !
లీలా వైభవము పుష్కరీ రమ్యంబౌ
మాలా సరస్వతీ హిత
మూలము వాక్ మయము నందు మునుకలు వేయన్ .
15. పృ :- డా . రఘురామ శర్మ .
వి :- మధ్యమావతి రాగ వర్ణన . ( ఈ రాగం లో ద, గ, ఉండక పోవటం దీని విశిష్టత )
కం . ద ,గ, లేనిది ఒదిగినదిది
నిగళంబే కాని రాగ నీతాధ్వర - శో
భగ మంగళ రస శిఖరము
భగవానుని పొగడు పగడ పసిడి యిదియగున్ .
16. పృ :- శ్రీమతి ప్రభల జానకి .
వి :- వేటూరి ప్రభాకర శాస్త్రిగారి 120 వ జయంతి , అన్నమయ్య జయంతి వర్ణన . అ, న, నిషిద్ధం .
కం . పద కవితకు పెద తండ్రిగ.
పద పదముల వేంకటేశ భక్తి పథమ్బై
పదవీ శ్రీ పతి కొలువై
సదమల వాక్ మయములందు శాశ్వతుడు కదా .
17. పృ :- విశ్వనాథ శర్మ .
వి :- అవధాన వైభవం . " అవధానపదం "నిషేధం .
కం . ఏకాగ్ర మనేకాగ్రము ,
శ్రీ కావ్యాక్షర సుదీక్ష చిర ధారణ గా
ఆ కోకిల యగు భారతి ,
శ్రీ కల్పన లాశుగతిని చిత్రించె నిటుల్ .
సశేషం .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి