🚺 ఓ చిట్టి తల్లీ!🚺
ఓ చిట్టి తల్లీ!
1.కవికి భావమె విలువ, సరసుకందమె కలువ,తగదు వైరిగనిలువ...... ఓ చిట్టితల్లీ!
2. రవిని ప్రాణులు కొలుచు, శశిని తల్లులు పిలచు,కవిని రాజులు తలచు.

3.భువిని జీవులు నిలచు, నెలత ప్రియతము వలచు, సతము ధర్మమె గెలుచు.
4.నీట ప్రబ్బలి పెరుగు, నీరు పల్లమునెరుగు, నిజము దైవంబెరుగు.
5.ఉప్పు నీటనుకరుగు, మంచి యోచనమెరుగు, లోకతత్త్వము నెరుగు.
6.సుధలు గురియునుకలము, భూమి దున్నునుహలము, కష్టపడినను ఫలము.
7.అమ్మ మనసది వెన్న, మనదు నదియన పెన్న,మనకు దేశమె మిన్న.
8.కన్న తండ్రిని మించు,ఉన్న ఖ్యాతినిబెంచు,కష్టముల సహియించు
9.కలుగ నీకును లోటు,ఆడి తప్పగచేటు,నిలువ యుండదుచోటు,
10.వాణి జ్ఞానము నిచ్చు, లక్ష్మి సంపదదెచ్చు,గౌరి సత్యము మెచ్చు.
11.యశము జూచిన తెలుపు,అపయశంబది నలుపు, మమత జగమున గెలుపు.
12.నేల మీదను మొక్క, నింగి లోనను రిక్క, జీవితముతైతక్క.
13. పగలు రేయన రోజు, మనసు పండిన మోజు, ప్రమద హృదిరేరాజు.
14.పాలు కుడుచును లేగ, పైకి ప్రాకును తీగ,చదువు నేర్వుమ వేగ.
15.నదుల పుట్టుక కొండ,వర్షమున నీరెండ,తలచ దైవమె యండ.
16.మంచి చేయగ కరము,దాని బొందుట వరము, అపుడుకీర్తియె స్థిరము.
17.శివుడు జీవికిరాజు,సింగమడవికి రాజు,సోమరె పోతరాజు.
18.విషపు మనుషుల చెంత,మనుట యెంతయొ చింత,వలదు వలదో కాంత.
19.జ్ఞాన శూన్యము శిలలు,తర్కపూర్ణము తలలు,అలుపు లేనివి యలలు.
20.సుకవి పంచును సుథలు,చదివి సతతము కథలు,మదిని వ్యధలు.
21.అమ్మ పెట్టగ వండి, మితము గలిగిన తిండి,రోగమెక్కడిదండి.
22.రానీకుజ్ఞానపథమును తెలుపు,కష్టమునచెయి గలుపు,మదిని ప్రేమను నిలుపు.
23.అమృతభాండము తెలుగు,త్రావ క్షేమము గలుగు,అదియె నీకగు వెలుగు.
24.ఆదికవినన్నయ్య, సూత్రకవి చిన్నయ్య,దైవమన కన్నయ్య.
25.మనసు తేటగనుంచు,మమత సమతలు పెంచు,మధుర ప్రేమనె పంచు.
26.కుంభకర్ణుని భ్రాత,రావణునితలరాత,మార్చ వచ్చెను సీత.
27.జీవితంబున తెరవు,చూపుచుండును గురువు,దాన బెరుగును పరువు.
28.వర్ణములేబదారు,అచ్చులుగనపదారు.పరుషముల్ సరియారు.
29.కనవిసర్గలు మూడు,హల్లులు ముప్పదేడు, వ్యాకరణముంజూడు.
30.భాషలోనను సంధి,చెప్పకుమ విసంధి, మంచిపేరు సుగంధి.
31.గ్రంథపఠనము మేలు,చేసికొనుమా వీలు,సుఖమగు జీవితాలు. 32.గాలిమేడలు కూలు,త్రాగుబోతులె తూలు,సింగ మునకే జూలు.
33. కోపమేశాపంబు,గ్రీష్మమే తాపంబు,నీచమేపాపంబు.
34. చీమ అల్పపు ప్రాణి,తానె కోటకు రాణి,చెల్లదిప్పుడు కాణి.
35. వసుధ పుట్టును చెట్టు,పైకి క్రిందికి మెట్టు, అశ హద్దునబెట్టు.
36. వసువు పుటమును బెట్టు,క్షేత్రములనిలచుట్టు,రాక్షసుల పనిబట్టు.
37.ఇంటి విషయము గుట్టు,మంచిపని తలపెట్టు,దేశమన జైకొట్టు.
38.పాము తోడను చెలిమి, కలిమి తోడను బలిమి, గుండెదరియౌ కొలిమి.
39.నమ్మబోకుమ పరుల,గర్వమందకు సిరుల,నరుకబోకుమ తరుల.
40.మంచి మాటనె చెప్పు, స్త్రీలకందమె కొప్పు,దానగుణమది యొప్పు.
41.వ్రాయగావలె కలము,దున్నుటకునిల హలము,కష్టపడిననె ఫలము.
42.నేల మానవరాజు,నింగినానెలరాజు,స్తుతులకేభట్రాజు.
43.కొమ్మ రెమ్మల పూలు,కదిపినంతనెరాలు,చెలిమికిలజవరాలు.
44.త్రాగు స్వచ్ఛపు నీరు,పారవేయకు నోరు,శాంతమెల్లెడ కోరు. 45.మట్టిదివ్వెల వెలుగు,అంధకారమె మలుగు,శుభము నీకిల కలుగు.
46.పదుగురాడెడు మాట, తాళముండెడు పాట,జగము మెచ్చెడు బాట.
47.దానగుణమది మిన్న,కడప నున్నది పెన్న,అమ్మ మదియే వెన్న.
48.భారతంబున యుక్తి, రామకథలో శక్తి,భాగవతమున భక్తి.
49.డాంబికంబులు వద్దు,హద్దునుండుట ముద్దు,జ్ఞానహీనుడు మొద్దు.
50.సంఘమందలి రీతి,పాటిసేయగ ఖ్యాతి,తప్పబోకుమ నీతి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి