తొలకరి చినుకులు..రైతుల తలపులు.
1. తొలకరి వానకై పుడమి తోషిత డెందము కందళింపగా
బలుమరు ప్రార్ధనల్ సలుప భద్రము గూర్పగ నెల్లవారికిన్
జలజలమంచురాలె చలచల్లని చిన్కులు రైతుబిడ్డకుం
గలవరమంతబోయి తమ కాంక్షలుదీరెను నున్నతంబుగన్.
2. రైతుగ నాదుబాధ్యతగ రాగముతో మడిదున్ని నాణ్యతన్
గోతులబూడ్చియెత్తయిన కుప్పలులాగి సమంబుజేయుచున్
మాతగ జూచుభూమిని సమాదర రీతినమస్కరించుచుం
జేతము రంజిలంబడెడు చిన్కుకు స్వాగతమిత్తు ప్రేమమై.
3. అన్నదాతగ పేరొంది యలరుచుండి
చిన్న పెద్దల యనురాగ సిరులబొంది
భారతావని గర్వించు పౌరుడనగ
బ్రతుకు సాగించు నుత్తమ మతినినేనె.
4. చక్కగ మోసులెత్తు సహజాంకురముల్ నిజతేజరాసులై
యొక్కటి యైనవీడక మహోన్నత భూమికణంబునుండియున్
మక్కువ మీరతొల్కరి సమంచిత భంగిని తొంగిచూచినం
దక్కువ యేమినాకికను దారకు సంతుకు భోగభాగ్యముల్.
5. పెండ్లి జేతును ఘనముగ బిల్లకపుడు
కొడుకు జదివింతు వెజ్జుగ కూర్మితోడ
ఇంటిదానికి కొనియిత్తు నింద్రమణులు
పంట నాయింట మితిమీరి పరచుకొనగ.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి