పంచారామాలలో మొదటి సుప్రసిద్ధ క్షేత్రం అమరారామం. (అమరావతి.) 2వది,కొమరారామం(కొమరవోలు)3వది, భీమారామం(భీమవరం)4వది,క్షీరారామం(పాలకొల్లు) 5వది,దక్షారామం.
నా జన్మస్థలానికి (పొన్నెకల్లు.)కూతవేటుదూరంలో పవిత్ర కృష్ణానదీతీరంలో ఉన్న అమరావతిలోని అమరేశ్వర స్వామిదర్శనం మా సోదరుని కుటుంబంతో ఈనాడు నాకెంతో పరమానందాన్ని కలిగించింది. నదీ ప్రాధాన్యమే ఉంటే అది తీర్థం,ఆలయ ప్రాధాన్యం ఉంటే క్షేత్రం. రెండు ప్రాధాన్యాల కలయిక దీనికుంది. ఆ కారణముచేత ఇది తీర్థక్షేత్రం రాజం. కాశీ మున్నగు వానివలె.
ఈశ్వరో అభిషేక ప్రియః ., విష్ణోః అలంకార ప్రియః ., సూర్యో నమస్కార ప్రియః ., బ్రాహ్మణో బహుజన ప్రియః.
(భోజనప్రియః కాదు). మాకు ఈశ్వరాభిషేకం చేయించే అవకాశం దొరకలేదు. కాని మానసికంగా అభిషేకం చేసినట్లు భావించి దర్శించి తత్ఫలాన్ని పొందినట్లు భావింంచాను. శారీరకంగా చేయలేని పనులను మానసికంగా చేసి ఫలితం పొందటం ఒక మార్గం. ఈ మార్గం నిష్కల్మష , భావనాబలంతోనే సాధ్యం.
మా అమ్మా, నాన్నగారు సజీవులుగా ఉండగా అంటే షుమారు 50 సంవత్సరముల క్రితం అమరేశ్వరునికి అందరం అభిషేకం స్వయంగా చేసిన జ్ఞాపకాలను నెమరువేసికొన్నాను. ఇది చిరకాల దర్శనం. కాని కృష్ణమ్మ జలాల క్రుంకులిడి , వానితో స్వామినభిషేకించుట ఒక వరమే. ఈనాటి కృష్ణానది స్థితి, కనీసం శిరస్సుపై నీటిని చల్లుకోలేని దుస్థితి. ఆపని కూడ మానసిక చర్యే అయింది. ఏదిఏమైనా సద్యస్కాల సదాలోచనతో పరమేశ్వర దర్శనం ఈనాడు లభ్యమైనది. అచటి ఆంజనేయ స్వామి , బుద్ధుని మహోన్నత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణలు. ఈ సందర్భంగా తీసిన కొన్ని చిత్రాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి