గురువర్యులు శ్రీమాన్. కోగంటివారికి ...పొన్నెకంటి
సమర్పించు అక్షరాంజలి. 28.11.2020.
సీ: కావ్యపఠనమందు కలరవంబునుజూపు
కోగంటివారికి కోటినతులు
చిరునవ్వు వెలయించి చెలువంబుజూపించు
కోగంటివారికి కోటినతులు
బల్చమత్కారంపు భాషణాధిషణులు
కోగంటివారికి కోటినతులు
సంస్కృతగ్రంథాల సరితెన్గుజేసిన
కోగంటివారికి కోటినతులు
ఆశుకవిత్వమందారితేరినమూర్తి
కోగంటివారికి కోటినతులు
భువనవిజయమందు నవరసంబులుజూపు
కోగంటివారికి కోటినతులు
వికటకవిగతాను వేదికనవ్వించు
కోగంటివారికి కోటినతులు
ఊర్ధ్వపుండ్రముల మహోన్నత తేజులౌ
కోగంటివారికి కోటినతులు
తే.గీ: కావ్యమందలి పాత్రల కంటిముందు
నిలిపి చూపించు పాండితీ నేర్పుగల్గు
ధీర వీరేశ్వరుని శిష్య చారులైన
వారి కందింతు వేవేల వందనములు.
బేతవోలు రామబ్రహ్మం గారిని గూర్చి....
చిన్ని నవ్వు తోడ చేతంబుమరపించి
మధుర కవితలల్లి మనసుదోచి
ప్రేమ పంచు గురువు బేతవోలందును
సత్యవాక్కులివియ సరసులార!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి