29, ఆగస్టు 2011, సోమవారం

గయ...పితృ కార్యాల గురించి

గయ...పితృ కార్యాల గురించి ..భావనలు,

 మానవజన్మ సార్ధకం అయ్యేది పితృ  ఋణము తీర్చుకున్నప్పుడే కదా ?

తే.గీ౧.పితరులెల్లరు ముక్తి సంప్రీతినంద,

          పిన్డమర్పింత్రు సత్సుతుల్ ప్రేమ మీర

          తండ్రి ఋణమును దీర్చుటే ధర్మమనుచు,

         గయనుమించిన స్థానంబు గానమనుచు.


తే.గీ౨ ఫల్గుణీతీర ప్రాంతంబు ప్రముఖమయ్యె,

         విష్ణుపాదంబు సోకిన విధమువలన

          మోక్షమబ్బుముత్తాతలకున్ లక్షణముగ,

         ఇంతకన్నను జీవికినేమివలయు ?


తే.గీ.౩.కోర్కెలన్నియు జిహ్వకుకూల్చుకొరకు,

          ఒక్కఫలమును, శాకంబు,నొక్కయాకు

          త్యాగ మొనరింత్రు గయను సద్దార్మికాళి 

          ఇష్ట పూర్తిగ మనమున స్పష్ట పరచి .


తే.గీ౪. జీవితాన్తంబు వాటిని చేరనీక,

         నియమ భంగమ్ముకానీక నిష్ట నుండి 

         సంప్ర దాయంబు పాటింత్రు సాధుజనులు, 

         వేద విదులైన సచ్చాస్త్ర వేత్త లెపుడు . 

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...