29, మార్చి 2014, శనివారం

మధుమాస మకరందం. ది. 31.03. 2014.

 సాక్షి పత్రిక కొఱకు వ్రాసిన ఉగాది కవిత . 

రాజకీయ విషయాలను అద్ది  కవిత 
వ్రాయాలని ప్రకటితము. 29. 03. 2014. 

నవ రాజకీయ సహజీవనానికి 
నాంది పలికింది మధుమాసం . 
ప్రజలను అణుమాత్రం పట్టించుకోక పోయినా 
రాజకీయ ఉనికిని జూపి, రామ రాజ్యాన్ని స్థాపించే 
సర్వ సమర్ధతలు జయ ఉగాది కల్పిస్తుందని 
ప్రతి ఒక్క (అ ) రాజకీయ నాయకుని దురాశ . 

మధు మాసం లో చిగురాకులు , ఆశా కుసుమాలు ,
పుంస్కోకిలల గాన లహరులు , రాజకీయానికి 
పనికి వచ్చే వస్తు సామగ్రి. 

 పార్టి ఏదైనా , వారిదైన పరమార్ధం . 
పర్వతమంత ఆశ ను చూపించి 
పరమాణు వంత  ప్రయోగాలు చేసి 
కంటికి కానరాని ప్రయోజనాలను 
ప్రజలకు పంచటమే (వి) నాయకుల పరమావధి 

ఉగాది పచ్చడిలో షడ్రుచులుంటాయి , కాని 
(అ ) రాజకీయ నాయకుని పలుకులలో 
ఒక్క మధువే ఉంటుంది . 

విజ్ఞత కల్గిన  ఓటరు మహాశయ పుంస్కోకిలలు 
డబ్బుకు ఓటు , ఉహూ , ఉహూ. అంటూ 
గున్న మావి లాంటి గృహం నుండే రెట్టించి పల్కితే 
ఏ అరాచక శక్తులు విజ్రుంభించి , మన 
వ్యక్తిత్వాన్ని చంపి , సమాజాన్ని సమయించి, ప్రభుతను  కొనసాగించలేవు . 

సగటు మానవ జీవనానికి , మన నవ జీవనానికి 
వసంత లక్ష్మి వంటి నాయకురాలు , 
వసంతుని వంటి రారాజు . కావాలి . 
ప్రతి పల్లె , పట్టణం , పచ్చదనం తో, స్వచ్చ దనం తో ,
మధు మాసం కావాలంటే 
రాజకీయ నాయకులు ,స్వార్ధం అనే నలుపు వదలి ,
పచ్చదనాన్ని ఆశ్రయించాలి . 
నిస్స్వార్ధ రాజకీయ నాయకుల అడుగు జాడలలో నడవాలి. 
ఆనాడే మనకు నిజమైన మధు మాసం ,మధుర మాసం . 

  
            మధుమాస మకరందం . 31. 03. 2014 

        జయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలతో  

నవజీవనానికి  నాంది మధుమాసం . 
వన జీవనానికి వసంతం సుమ దరహాసం , సుమధుర హాసం , 
మానవ జీవన శైలికిది  సన్మార్గ సూచిక . 
మానస పరిణతి కిది మహనీయ రోచిక 

షడ్రుచుల యుగాది దేవతకు సాష్టాంగ ప్రణామం . 
ఏ రుచైనా ప్రకృతి మాత  ప్రసాదంగా చేద్దాం ప్రమాణం 
తీపి సుఖాలు కోరుతూ , చేదు కష్టాల పరాకాష్ట ల నధిగమించి 
గెలుపు పులుపు రసమూరిస్తే , ఉప్పు కారాల జయం ఊపందు కొంటే 
వగరు పొగరుతో జీవనం సాగించే 
మానవ రూపానికి మధు మాసం ఒక వరం . 
శుభోదయంతో సుందరి యిచ్చిన ఉగాది పచ్చడి లో 
కొంచెం చేదు  ఎక్కువైన, చిరు నవ్వులు చిందిస్తూ 
 శ్రీమతి మనసు తీపి చేయటానికి 
 ఏమోయ్, ఉగాది పచ్చడి అచ్చంగా పటిక  బెల్లం తో చేశావా అనే 
భర్తల నటనా విన్యాసం అద్భుతం వేప పూత సాక్షిగా . 
( ఉగాది రోజు మనసు బాధపెడితే సంవత్సరమంతా బాధ పడతారని ) 
చేదెక్కువైనా , తక్కువైనా , అది నింబ పుష్పాది సమ్మిశ్రితం 
ఆయురారోగ్య ప్రదాయకం . 
నవ జీవన కుసుమానికి , నవ్య పరిమళ విలసితం 
సర్వ రుచుల సమ్మేళనం తో సౌభాగ్య భోగ భాగ్యాలను 
జయ నామ ఉగాదికి పంచుకుందాం . అవకాశమిమ్మని దేవుని వేడుకొందాం ,


1, మార్చి 2014, శనివారం

శివానంద మూర్తి గారికి పద్య నీరాజనమ్

  శైవ పీఠాధిపతి,మహా మహో పాధ్యాయ , సద్గురు డా . శ్రీ శివానంద మూర్తి గారికి పద్య నీరాజనమ్.  ( వేద గాయత్రీ అగ్రహారం తరఫున ) ది.02.03. 2014 . 
                                                 లలితకళా మండపం లో . 
  కందుకూరి వంశోద్భవ కాంతిరేఖా , మంగళ  స్వరూపా .......

1.సీ.  సర్వమంగళాఖ్యత సాధ్వీమతల్లికి ,  ముద్దుల పట్టి యౌ మోహనుండు .
       
         వీర బసవరాజ వేదాంత సారంబు , కోరి జుఱ్ఱినయట్టి  వారసుండు .

         భీముని పట్నాన ప్రేమను పంచగా , ఆశ్రయమంబిడి నట్టి యమృత మూర్తి .

         చిన్నతనము నుండి చిన్ముద్ర పట్టిన , చిద్రూపి , సద్యోగ చిన్మయుండు .

తే.గీ.  తల్లి దండ్రుల విఖ్యాతి ధరణి బెంచ , సవ్య సాచిగా నిల్చిన సత్త్వ మూర్తి .

         కందుకూరి వంశోద్భవ కాంతి రేఖ , నవ్య ధార్మికాత్ముడు శివానందమూర్తి .

ఆర్ష ధర్మ ప్రచారకా , అమల యోగీ . ......

2. సీ.  సంగీత నాటక సారస్వతంబులన్ , వృద్ధి పరుపగా జూచు సిద్ధ యోగి

         ఉద్ద్యోగ ధర్మాన నున్నత లక్ష్యాల చెక్కు చెదరనీని చిద్విలాసి.

         ఆర్ష ధర్మంబుల నద్వితీయపు రీతి , పంచి పెట్టిన యట్టి పరమ గురువు .

        సంస్కృతీ విభవాల సాటి దేశములందు , చాటి చెప్పు  మన చిచ్ఛక్తి యితడు ..

తే.గీ.  వాణి  కరుణకు పాత్రుడౌ వందనీయ , సాధు సన్మూర్తి సద్ధర్మ సాధకుండు .

         శ్రీ శివానంద వర్యుండు శ్రేయమంద కాంక్ష సేయుదు నిరతంబు గరళ  కంఠు .

 ఆనంద నిలయా . శివానంద సదయా ,.........

3. సీ. యజ్ఞ యాగములందు  ప్రజ్ఞా ధురీణ తన్ , ఆర్షము  పండించు కర్షకుండు

        భారతీయత పేర భవ్యసంస్కృ తులెల్ల , విశ్వాన పంచెడు విబుధ వరుడు .

       అద్వైత జ్ఞానంబు నహరహంబున పంచి , విజ్ఞాన తెజుడై వెల్గు నతడు

       యోగ శాస్త్రంబన రాగంబు జూపుచు , ఋషి తుల్యు లైనట్టి రుత్విజుండు .

తే.గీ. భరత భూమికి దిగినట్టి ప్రణవ మూర్తి , భక్తి  తత్త్వంబు పండిన ప్రాక్తనుండు

       పరమ పుణ్యుం డు సద్దయా భరణుడతడు , శ్రీ శివానంద వర్యుండు శ్రేయధనుడు .

బహు గ్రంథ రచనా దురీణా  .  పూజ్య మహర్షీ ........

4. సీ. కఠ యోగ గ్రంథంబు కంచి స్వాముల చేత , మన్ననలందుట మరువలేము .

        పూజ్య మహర్షుల పుణ్య చరిత్రలు , మాల గూర్చుటదియ  మరువలేము .

         గౌతమ చరితంబు స్తుత్యమై రాజిల్ల , శిల్ప నైపుణ్యంబు చెదరలేదు .

       శ్రీ కృష్ణ పేరున చిద్విలాసము గాగ , భావ రమ్యంబది భద్రమగును .

తే.గీ. కావ్య మెట్టిదియైనను ఖ్యాతిగాంచి , సారవంతంపుటర్ధాల సరసి యగుచు

        ధర్మ వేదాంత శాస్త్రాల దారి జూపి , మూర్తి వర్యులు ధన్యులై మురిసినారు.

చరద్వి జ్ఞాన  సర్వస్వమా . పీఠాధిపతీ ...........

5. ఉ. మానవ జీవితంబెతుల మాన్యత గల్గెడు రీతి నుండునో .

          తానుగ చేసి చూపుచును ధర్మ ప్రర్తన ఎంత ముఖ్యమో ,

          వేనకు వేలుగా పరమా వేదిక లందు వచించి చూపు .. నా

          ధ్యాన నిమగ్న మూర్తి గుణ దామునకున్ కుసుమామ్జలిత్తు ..నే .  .

  కలం, గళం , పొన్నె కంటి సూర్య నారాయణ రావు . సమర్పణ . యల్లాప్రగడ  ప్రభాకర శర్మ .










పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...