మధుమాస మకరందం . 31. 03. 2014
జయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలతో
నవజీవనానికి నాంది మధుమాసం .
వన జీవనానికి వసంతం సుమ దరహాసం , సుమధుర హాసం ,
మానవ జీవన శైలికిది సన్మార్గ సూచిక .
మానస పరిణతి కిది మహనీయ రోచిక
షడ్రుచుల యుగాది దేవతకు సాష్టాంగ ప్రణామం .
ఏ రుచైనా ప్రకృతి మాత ప్రసాదంగా చేద్దాం ప్రమాణం
తీపి సుఖాలు కోరుతూ , చేదు కష్టాల పరాకాష్ట ల నధిగమించి
గెలుపు పులుపు రసమూరిస్తే , ఉప్పు కారాల జయం ఊపందు కొంటే
వగరు పొగరుతో జీవనం సాగించే
మానవ రూపానికి మధు మాసం ఒక వరం .
శుభోదయంతో సుందరి యిచ్చిన ఉగాది పచ్చడి లో
కొంచెం చేదు ఎక్కువైన, చిరు నవ్వులు చిందిస్తూ
శ్రీమతి మనసు తీపి చేయటానికి
ఏమోయ్, ఉగాది పచ్చడి అచ్చంగా పటిక బెల్లం తో చేశావా అనే
భర్తల నటనా విన్యాసం అద్భుతం వేప పూత సాక్షిగా .
( ఉగాది రోజు మనసు బాధపెడితే సంవత్సరమంతా బాధ పడతారని )
చేదెక్కువైనా , తక్కువైనా , అది నింబ పుష్పాది సమ్మిశ్రితం
ఆయురారోగ్య ప్రదాయకం .
నవ జీవన కుసుమానికి , నవ్య పరిమళ విలసితం
సర్వ రుచుల సమ్మేళనం తో సౌభాగ్య భోగ భాగ్యాలను
జయ నామ ఉగాదికి పంచుకుందాం . అవకాశమిమ్మని దేవుని వేడుకొందాం ,

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి