నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
14, అక్టోబర్ 2011, శుక్రవారం
29, ఆగస్టు 2011, సోమవారం
ఆగ్రా
ఆగ్రా . తే. గీ. ౨. కళల కాణాచి ఐనట్టి కర్మభూమి.
యోగి పాదాలు తాకిన యోగ భూమి
యోగి పాదాలు తాకిన యోగ భూమి
శాంత వీరాలు కలసిన సౌమ్యభూమి.
భరత భూమిక దీటైన ధరణి కలదె
తే.గీ . పాలరాతిన నీడయై పాదుషాఏ , తిరుగుచుండును సతతంబు స్థిరముగాను .
తే.గీ.౪. ప్రేమబంధాలు మనములపెనచివేయ
భరత భూమిక దీటైన ధరణి కలదె
తే.గీ . పాలరాతిన నీడయై పాదుషాఏ , తిరుగుచుండును సతతంబు స్థిరముగాను .
తనదు నెచ్చెలి జీవిక ధన్యమవగ
తర తరంబులు కీర్తులు తారలవగ తే.గీ.౪. ప్రేమబంధాలు మనములపెనచివేయ
రాజు మదినిండ ప్రియురాలి మోజు పెరిగి
విశ్వవిఖ్యాతమహలుగావెల్గుచుండె,
తాజ మహలను పేరున తరతరాలు .
ఇలా మా అనుభవాలు మీరును పంచుకున్నందుకు కృతఙ్ఞతలు.
అలహాబాదు, ప్రయాగ, ఆగ్రా
అలహాబాదు, ప్రయాగ , త్రివేణి సంగమ స్థలము. అనుభవాలు
తే.గీ ౧. గంగ మునుగంగ కలుషాలు కాలి పోవు ,
మూడుగంగలుకలసిన మోక్ష మబ్బు .
తే.గీ ౧. గంగ మునుగంగ కలుషాలు కాలి పోవు ,
మూడుగంగలుకలసిన మోక్ష మబ్బు .
అలహాబాదున నియ్యది యమరి యుండె,
దాని ప్రాశస్త్య మన్యదా కానగలమే ?
దాని ప్రాశస్త్య మన్యదా కానగలమే ?
తే.గీ. ౨.మధుర భావాలు వెల్లువై మనసునందు .
అలహాబాదును స్మరియింప నలవికావు
. మూడు పడవల నడుమను మునిగి లేచు ,
అనుభవంబది వేరొండు నంద గలమే ?
అలహాబాదును స్మరియింప నలవికావు
. మూడు పడవల నడుమను మునిగి లేచు ,
అనుభవంబది వేరొండు నంద గలమే ?
ఆగ్రా .. తాజ్మహల్ .మా మధుర అనుభూతులు.
తే .గీ . ౩. దేశ దేశాల వాసులు దిశలు నిండ .
ఆగ్ర పట్టణ మన్నను ననవరతము
ఆగ్ర పట్టణ మన్నను ననవరతము
కాంచ వత్తురు కళల పై కాంక్ష కలిగి
. భరత శిల్పుల ఉలులకు హారతిడగ.
. భరత శిల్పుల ఉలులకు హారతిడగ.
కాశి
కం . ౫. గంగా తీర్థము జీవికి, భంగంబులు కలుగనట్టి బహు ముఖ పుణ్యాల్
లింగమ్ము తాకి నట్లుగ, పొంగారుచు కల్గు గాదె మోదం బెలరన్ .
కాశి విశ్వేశ్వరు నకు ముందుగా డున్ద్ది గణపయ్య మనకు దర్శన మిస్తాడు.
ఆయనను గురించి .
ఆయనను గురించి .
తే.గీ.౬. డున్ద్ది గణపయ్య కరుణ మాకున్డి యుంట , ఈశ్వరార్చన సులువాయె
నీప్సితముగ .
నీప్సితముగ .
అన్నపూర్ణ, విశాలాక్షి యాశిషాన, మధుర భావాలు నిండెను
మనములందు.
మనములందు.
అన్నపూర్ణాదేవి కాశిలో ఉండగా అన్నానికి కరువా ? భక్తు లందరికి భోజన
సదుపాయం ఉన్నది కాశిలో
సదుపాయం ఉన్నది కాశిలో
ఉ. ౮. కమ్మని వంటకాలు మమకారము నిండిన వడ్డనమ్బులున్
అమ్మకు దీసిపోని కరుణామృత సార రసంబు లన్నియున్ ,
గుమ్మము ద్రొక్కు భక్తులకు కూరిమి నిత్తురు ప్రేమ భావనన్
అమ్మగు నన్నపూర్ణ దరి యన్నము లేదను నార్తు లున్దురే?
తే .గీ .౮, అన్నపూర్ణమ్మ సన్నిధి నన్న మెపుడు ,లేదు లేదంచు పల్కులు లేశమైన
వినగ రావయ్యో కలనైన విబుదులార , వ్యాసు డొక్కడే పాపాన వాదు నొందె.?
గయ, వారణాశి
తే.గీ ౫. సూర్య నారాయనాఖ్యుండ సూరి వరుడ .
నేను రంభాఫలంబును, ఇష్టమైన
చేమ మద్దిపత్రంబును చివరి దనుక
వాడనంచును పల్కితి వాస్తవముగ
బుద్ధ గయ నుండి ....వారణాశి కి చేరిన తరువాత .
కాశి . వారణాశి ,బెనారస్ .ఒక్కటే . కాశి లో స్నానం ...ఫలం.
కం. ౧. గంగా తరంగ డోలిక
సంగాతమ్ము నే నరుండు సంతస మొప్పన్
భంగంబు గాని భంగిమ
లింగార్చన జేయునతడు లీలన్ శివుడౌ.
తే. గీ ,౨. గంగ మునుగంగ పాపాలు నింగి కెగయు ,
గంగ తాకంగ కవితలే పొంగి పొరలు .
గంగ తాకంగ కవితలే పొంగి పొరలు .
గంగ తలుపంగ తలపులే చెంగలించు ,
గంగ మహిమలు తెలుపంగ ఘనులు గలరే ?
గంగ మహిమలు తెలుపంగ ఘనులు గలరే ?
గయ...పితృ కార్యాల గురించి
మానవజన్మ సార్ధకం అయ్యేది పితృ ఋణము తీర్చుకున్నప్పుడే కదా ?
తే.గీ౧.పితరులెల్లరు ముక్తి సంప్రీతినంద,
పిన్డమర్పింత్రు సత్సుతుల్ ప్రేమ మీర
పిన్డమర్పింత్రు సత్సుతుల్ ప్రేమ మీర
తండ్రి ఋణమును దీర్చుటే ధర్మమనుచు,
గయనుమించిన స్థానంబు గానమనుచు.
గయనుమించిన స్థానంబు గానమనుచు.
తే.గీ౨ ఫల్గుణీతీర ప్రాంతంబు ప్రముఖమయ్యె,
విష్ణుపాదంబు సోకిన విధమువలన
విష్ణుపాదంబు సోకిన విధమువలన
మోక్షమబ్బుముత్తాతలకున్ లక్షణముగ,
ఇంతకన్నను జీవికినేమివలయు ?
ఇంతకన్నను జీవికినేమివలయు ?
తే.గీ.౩.కోర్కెలన్నియు జిహ్వకుకూల్చుకొరకు,
ఒక్కఫలమును, శాకంబు,నొక్కయాకు
ఒక్కఫలమును, శాకంబు,నొక్కయాకు
త్యాగ మొనరింత్రు గయను సద్దార్మికాళి
ఇష్ట పూర్తిగ మనమున స్పష్ట పరచి .
ఇష్ట పూర్తిగ మనమున స్పష్ట పరచి .
తే.గీ౪. జీవితాన్తంబు వాటిని చేరనీక,
నియమ భంగమ్ముకానీక నిష్ట నుండి
సంప్ర దాయంబు పాటింత్రు సాధుజనులు,
వేద విదులైన సచ్చాస్త్ర వేత్త లెపుడు .
నియమ భంగమ్ముకానీక నిష్ట నుండి
సంప్ర దాయంబు పాటింత్రు సాధుజనులు,
వేద విదులైన సచ్చాస్త్ర వేత్త లెపుడు .
గయ,, బుద్ధ గయ
తే గి ౧. జీవితంబున మోక్షంబు చేరు కొరకు,
సత్య శోధన యొక్కటే మార్గ మనుచు
బోధి వృక్షంపు నీడన పూర్ణ భక్తి ,
తత్వ జ్ఞానంబు నెరుగగ తపముజేసె.
సత్య శోధన యొక్కటే మార్గ మనుచు
బోధి వృక్షంపు నీడన పూర్ణ భక్తి ,
తత్వ జ్ఞానంబు నెరుగగ తపముజేసె.
౨. పట్టువీడని పంతాన పరమహంస,
రూపు గాంచెను బుద్ధుడు చూపునిలిపి,
అనిమిశున్డయ్యె నాటితో నద్భుతముగ.
దివ్య శక్తికి మించిన దేది కలదు ?
రూపు గాంచెను బుద్ధుడు చూపునిలిపి,
అనిమిశున్డయ్యె నాటితో నద్భుతముగ.
దివ్య శక్తికి మించిన దేది కలదు ?
౩. విష్ణు రూపుండు బుద్ధుండు వేద విదుడు,
ధర్మ తత్వంబు జీవికి తరచి చూపి
ధర్మ తత్వంబు జీవికి తరచి చూపి
ముక్తి మార్గంబు కల్పింప పూనుకొనియె,
స్వార్థ చింతన లేనట్టి సాధు మూర్తి.
స్వార్థ చింతన లేనట్టి సాధు మూర్తి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.
ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1 సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...
-
షష్టి పూర్తులు , సహస్ర చంద్రదర్శన శాంతిహోమాలు అవసరాలా ? ఆడంబరాలా ? ప్రపంచ దేశాలు మన దేశానికి మోకరిల్లేది మన ఆర్ధిక సంపదను చూ...
-
చెడుగు చీకట్ల నిరతంబు చీల్చివేయు 3.11.2013. వెలుగు రేఖలు జీవన వేల్పులనగ మాన వాళి కి లభియించె మహితగతిని ...
-
కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా. ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మ...
