కర్నూల్ కు సుమారు 30 కి మీ. దూరంలో ఉన్న ఐదవ శక్తి పీఠమైన , జోగులాంబా దేవిని మొదటగా చూచే అదృష్టం కలిగింది. ఆ తరువాత భక్త ప్రహ్లాదుని అవతారమైన రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది . ఇది ఒక మనోహరానుభూతి .రెండు రోజుల వ్యవధానములోనే శిరిడి సాయినాధుని దర్శించుకొనే భాగ్యం కలిగింది. అనుకోని దర్శనమే సాయి బాబా ఇస్తారని అది వారి ప్రత్యేకత అని అంటారు. నేనలానే పొందాను . శిరిడి కి 90 కి . మీ దూరం లో ఉన్న నాసిక్ తరువాత త్రయంబకేశ్వరుని దర్శించటం జరిగింది . గోదావరి జన్మఆపర్వత శ్రేణుల సమీపం లోనే జరిగింది. పునీతమైన ఆ ప్రదేశాలు తిరుగుతుంటే మధుర మనోహర భావన ఎవరికైన తప్పక కలుగుతుందని నా భావన . అవకాశాలు చెప్పి రావనేది సత్యం. చిత్రాలు మనోహరం. చూడండి భక్తి తో మైమరచి . ఈ అవకాశానికి కారకుడు యల్లాప్రగడ సాయి తేజో భరద్వాజ. . వాడి శిరిడి మ్రొక్కు కారణం . 8 మందిమి కలసి మహదానందం పొందాము .
నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
19, మే 2014, సోమవారం
11, మే 2014, ఆదివారం
చాలదు భావం అమ్మ గూర్చి చెప్పటానికి .
చాలదు భావం అమ్మ గూర్చి చెప్పటానికి .
చాలవు పదాలు అమ్మ గూర్చి చెప్పటానికి .
చాలవు శబ్దాలు అమ్మ గూర్చి చెప్పటానికి .
చాలవు లేఖినులు అమ్మ గూర్చి వ్రాయటానికి .
చాలదు యెంత సేవైన అమ్మకు చేయటానికి .
చాలదు యెంత ధనమైన మాత్రూణము తీర్చటానికి .
చాలవు ఎన్ని జన్మలైనా అమ్మ ప్రేమకు బదులివ్వటానికి
చాలరు ఎందరున్న అమ్మ పదవి తీర్చటానికి .
ప్ర కృ తే అమ్మ , అమ్మయే ప్ర కృ తి .
పురుషుడు నాన్న ప్రకృతి తోడుగా నాకు మమతల మల్లెలు పంచారు
అందుకు చాలిన ఆలోచన నాకొకటి వచ్చింది . అదే నిరంతరంప్రేమగా మాతాపితృభ్యో నమహ అనటం.
తన జన్మకు కారకులైన వారికి చెరగని చిరునవ్వుతో ప్రేమను పంచటం,పెంచటం
చాలు చాలు చాలు అంటుంది చల్లని తల్లి ఎవరైనా ఎక్కడున్నా .
మాతృ దినోత్సవం సందర్భంగా . నమస్సులతొ. సూర్యనారాయణ రావు . 11. 05. 14

16, ఏప్రిల్ 2014, బుధవారం
11, ఏప్రిల్ 2014, శుక్రవారం
బెండపూడి లక్ష్మి కుమారి గారికి అభినందన పద్యము
శ్రీమతి బెండపూడి లక్ష్మి కుమారి గారికి అభినందన పద్యము. ( వల్లీ కల్యాణం ) 9.04.2014.

సీ. సంగీత సాధనన్ సం స్తూ యమానినై
వాణి కి రూపుగా వరలె నెవరు
సాహితీ పాతవ సమ్స్కారముల్ జూపి
పలుకుల రాణి గ పండె నెవరు
చిరు నాట్య విన్యాస చిన్ముద్ర లం జూపి
భంగిమల్ జూపెడు భామ యెవరు
దేశ దేశాలెల్ల తెల్గు వైభవమ్ము
హరి కదా రూపాన అందజేసి
తే.గీ. బెండ పూ డి వంశ ప్రేమార్ద్ర రాశి యౌ
లక్ష్మి కొమరిత గుణ రత్న భావ
విలషిత మమతాల వాలమౌ గృ హిణి
భావి కాలమందు భద్ర మగుత .
గుంటూరు .
శ్రీ రామ్ నగర్

కీ.శే . యల్లాప్రగడ శ్రీరామ మూర్తి గారి ప్రాంగణం (గుంటూరు ) లో శ్రీ సీతారామ కల్యాణమహోత్సవము . చిత్రపటాలు .

విజయవాడ దుర్గ అమ్మవారి ఆలయంలో చిత్రం .

విజయవాడ దుర్గ అమ్మవారి ఆలయంలో చిత్రం . 29, మార్చి 2014, శనివారం
మధుమాస మకరందం. ది. 31.03. 2014.
సాక్షి పత్రిక కొఱకు వ్రాసిన ఉగాది కవిత .
రాజకీయ విషయాలను అద్ది కవిత
వ్రాయాలని ప్రకటితము. 29. 03. 2014.
నవ రాజకీయ సహజీవనానికి
నాంది పలికింది మధుమాసం .
ప్రజలను అణుమాత్రం పట్టించుకోక పోయినా
రాజకీయ ఉనికిని జూపి, రామ రాజ్యాన్ని స్థాపించే
సర్వ సమర్ధతలు జయ ఉగాది కల్పిస్తుందని
ప్రతి ఒక్క (అ ) రాజకీయ నాయకుని దురాశ .
మధు మాసం లో చిగురాకులు , ఆశా కుసుమాలు ,
పుంస్కోకిలల గాన లహరులు , రాజకీయానికి
పనికి వచ్చే వస్తు సామగ్రి.
పార్టి ఏదైనా , వారిదైన పరమార్ధం .
పర్వతమంత ఆశ ను చూపించి
పరమాణు వంత ప్రయోగాలు చేసి
కంటికి కానరాని ప్రయోజనాలను
ప్రజలకు పంచటమే (వి) నాయకుల పరమావధి
ఉగాది పచ్చడిలో షడ్రుచులుంటాయి , కాని
(అ ) రాజకీయ నాయకుని పలుకులలో
ఒక్క మధువే ఉంటుంది .
విజ్ఞత కల్గిన ఓటరు మహాశయ పుంస్కోకిలలు
డబ్బుకు ఓటు , ఉహూ , ఉహూ. అంటూ
గున్న మావి లాంటి గృహం నుండే రెట్టించి పల్కితే
ఏ అరాచక శక్తులు విజ్రుంభించి , మన
వ్యక్తిత్వాన్ని చంపి , సమాజాన్ని సమయించి, ప్రభుతను కొనసాగించలేవు .
సగటు మానవ జీవనానికి , మన నవ జీవనానికి
వసంత లక్ష్మి వంటి నాయకురాలు ,
వసంతుని వంటి రారాజు . కావాలి .
ప్రతి పల్లె , పట్టణం , పచ్చదనం తో, స్వచ్చ దనం తో ,
మధు మాసం కావాలంటే
రాజకీయ నాయకులు ,స్వార్ధం అనే నలుపు వదలి ,
పచ్చదనాన్ని ఆశ్రయించాలి .
నిస్స్వార్ధ రాజకీయ నాయకుల అడుగు జాడలలో నడవాలి.
ఆనాడే మనకు నిజమైన మధు మాసం ,మధుర మాసం .

మధుమాస మకరందం . 31. 03. 2014
జయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలతో
నవజీవనానికి నాంది మధుమాసం .
వన జీవనానికి వసంతం సుమ దరహాసం , సుమధుర హాసం ,
మానవ జీవన శైలికిది సన్మార్గ సూచిక .
మానస పరిణతి కిది మహనీయ రోచిక
షడ్రుచుల యుగాది దేవతకు సాష్టాంగ ప్రణామం .
ఏ రుచైనా ప్రకృతి మాత ప్రసాదంగా చేద్దాం ప్రమాణం
తీపి సుఖాలు కోరుతూ , చేదు కష్టాల పరాకాష్ట ల నధిగమించి
గెలుపు పులుపు రసమూరిస్తే , ఉప్పు కారాల జయం ఊపందు కొంటే
వగరు పొగరుతో జీవనం సాగించే
మానవ రూపానికి మధు మాసం ఒక వరం .
శుభోదయంతో సుందరి యిచ్చిన ఉగాది పచ్చడి లో
కొంచెం చేదు ఎక్కువైన, చిరు నవ్వులు చిందిస్తూ
శ్రీమతి మనసు తీపి చేయటానికి
ఏమోయ్, ఉగాది పచ్చడి అచ్చంగా పటిక బెల్లం తో చేశావా అనే
భర్తల నటనా విన్యాసం అద్భుతం వేప పూత సాక్షిగా .
( ఉగాది రోజు మనసు బాధపెడితే సంవత్సరమంతా బాధ పడతారని )
చేదెక్కువైనా , తక్కువైనా , అది నింబ పుష్పాది సమ్మిశ్రితం
ఆయురారోగ్య ప్రదాయకం .
నవ జీవన కుసుమానికి , నవ్య పరిమళ విలసితం
సర్వ రుచుల సమ్మేళనం తో సౌభాగ్య భోగ భాగ్యాలను
జయ నామ ఉగాదికి పంచుకుందాం . అవకాశమిమ్మని దేవుని వేడుకొందాం ,
జయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలతో
నవజీవనానికి నాంది మధుమాసం . వన జీవనానికి వసంతం సుమ దరహాసం , సుమధుర హాసం ,
మానవ జీవన శైలికిది సన్మార్గ సూచిక .
మానస పరిణతి కిది మహనీయ రోచిక
షడ్రుచుల యుగాది దేవతకు సాష్టాంగ ప్రణామం .
ఏ రుచైనా ప్రకృతి మాత ప్రసాదంగా చేద్దాం ప్రమాణం
తీపి సుఖాలు కోరుతూ , చేదు కష్టాల పరాకాష్ట ల నధిగమించి
గెలుపు పులుపు రసమూరిస్తే , ఉప్పు కారాల జయం ఊపందు కొంటే
వగరు పొగరుతో జీవనం సాగించే
మానవ రూపానికి మధు మాసం ఒక వరం .
శుభోదయంతో సుందరి యిచ్చిన ఉగాది పచ్చడి లో
కొంచెం చేదు ఎక్కువైన, చిరు నవ్వులు చిందిస్తూ
శ్రీమతి మనసు తీపి చేయటానికి
ఏమోయ్, ఉగాది పచ్చడి అచ్చంగా పటిక బెల్లం తో చేశావా అనే
భర్తల నటనా విన్యాసం అద్భుతం వేప పూత సాక్షిగా .
( ఉగాది రోజు మనసు బాధపెడితే సంవత్సరమంతా బాధ పడతారని )
చేదెక్కువైనా , తక్కువైనా , అది నింబ పుష్పాది సమ్మిశ్రితం
ఆయురారోగ్య ప్రదాయకం .
నవ జీవన కుసుమానికి , నవ్య పరిమళ విలసితం
సర్వ రుచుల సమ్మేళనం తో సౌభాగ్య భోగ భాగ్యాలను
జయ నామ ఉగాదికి పంచుకుందాం . అవకాశమిమ్మని దేవుని వేడుకొందాం ,
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.
ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1 సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...
-
షష్టి పూర్తులు , సహస్ర చంద్రదర్శన శాంతిహోమాలు అవసరాలా ? ఆడంబరాలా ? ప్రపంచ దేశాలు మన దేశానికి మోకరిల్లేది మన ఆర్ధిక సంపదను చూ...
-
చెడుగు చీకట్ల నిరతంబు చీల్చివేయు 3.11.2013. వెలుగు రేఖలు జీవన వేల్పులనగ మాన వాళి కి లభియించె మహితగతిని ...
-
కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా. ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మ...