29, ఆగస్టు 2011, సోమవారం

ఆగ్రా

             ఆగ్రా . తే. గీ. ౨. కళల కాణాచి ఐనట్టి కర్మభూమి.

                                                  యోగి  పాదాలు తాకిన యోగ భూమి  

                                                                   శాంత వీరాలు కలసిన సౌమ్యభూమి.

                                                                   భరత భూమిక దీటైన ధరణి కలదె


                                      తే.గీ .   పాలరాతిన నీడయై పాదుషాఏ ,                                                                                                    తిరుగుచుండును సతతంబు స్థిరముగాను . 

                                                  తనదు నెచ్చెలి జీవిక ధన్యమవగ 
                                                  తర తరంబులు కీర్తులు తారలవగ 

                                                                                                                                            తే.గీ.౪.    ప్రేమబంధాలు మనములపెనచివేయ

                                        రాజు మదినిండ ప్రియురాలి మోజు పెరిగి

                                 విశ్వవిఖ్యాతమహలుగావెల్గుచుండె,
                         
                                  తాజ మహలను పేరున తరతరాలు .

                        
ఇలా మా అనుభవాలు మీరును పంచుకున్నందుకు  కృతఙ్ఞతలు.

అలహాబాదు, ప్రయాగ, ఆగ్రా

అలహాబాదు, ప్రయాగ  ,  త్రివేణి సంగమ స్థలము.  అనుభవాలు

                                  తే.గీ ౧. గంగ మునుగంగ కలుషాలు కాలి పోవు ,

                                             మూడుగంగలుకలసిన మోక్ష మబ్బు .


                                               అలహాబాదున నియ్యది యమరి యుండె,

                                              దాని ప్రాశస్త్య మన్యదా   కానగలమే ?


                              తే.గీ. ౨.మధుర భావాలు వెల్లువై మనసునందు .

                                          అలహాబాదును స్మరియింప నలవికావు 

.                                        మూడు పడవల నడుమను మునిగి లేచు , 

                                          అనుభవంబది వేరొండు నంద గలమే ?


 ఆగ్రా .. తాజ్మహల్ .మా మధుర అనుభూతులు.

                            తే .గీ . ౩. దేశ దేశాల వాసులు దిశలు నిండ . 

                                        ఆగ్ర పట్టణ మన్నను ననవరతము
                                        కాంచ వత్తురు కళల పై కాంక్ష కలిగి

 .                                      భరత శిల్పుల ఉలులకు హారతిడగ. 

కాశి

కం . ౫. గంగా తీర్థము జీవికి, భంగంబులు కలుగనట్టి బహు ముఖ పుణ్యాల్

           లింగమ్ము తాకి నట్లుగ,  పొంగారుచు కల్గు గాదె మోదం బెలరన్ .

కాశి విశ్వేశ్వరు నకు ముందుగా డున్ద్ది గణపయ్య మనకు దర్శన మిస్తాడు.

 ఆయనను గురించి .

తే.గీ.౬. డున్ద్ది గణపయ్య కరుణ మాకున్డి యుంట , ఈశ్వరార్చన సులువాయె

            నీప్సితముగ .

            అన్నపూర్ణ, విశాలాక్షి  యాశిషాన, మధుర భావాలు నిండెను

            మనములందు.

అన్నపూర్ణాదేవి కాశిలో ఉండగా అన్నానికి కరువా ? భక్తు లందరికి భోజన

సదుపాయం ఉన్నది కాశిలో

ఉ. ౮. కమ్మని వంటకాలు మమకారము నిండిన వడ్డనమ్బులున్

         అమ్మకు దీసిపోని కరుణామృత సార రసంబు లన్నియున్ ,

         గుమ్మము ద్రొక్కు భక్తులకు కూరిమి నిత్తురు ప్రేమ భావనన్

         అమ్మగు నన్నపూర్ణ  దరి యన్నము లేదను నార్తు లున్దురే?

తే .గీ .౮, అన్నపూర్ణమ్మ సన్నిధి నన్న మెపుడు ,లేదు లేదంచు పల్కులు                 లేశమైన

             వినగ రావయ్యో  కలనైన విబుదులార , వ్యాసు డొక్కడే                పాపాన వాదు నొందె.?

గయ, వారణాశి

గయలో పొన్నెకంటి సూర్య నారాయణ రావు . పితృ దేవతలకు పిండ ప్రదాన

 మొనర్చి వదలిన వస్తువులు 

తే.గీ ౫. సూర్య నారాయనాఖ్యుండ సూరి వరుడ . నేను రంభాఫలంబును,                 ఇష్టమైన .

            చేమ . మద్దిపత్రంబును చివరి దనుక . వాడనంచును పల్కితి                       వాస్తవముగ

బుద్ధ గయ నుండి ....వారణాశి కి చేరిన తరువాత .

కాశి . వారణాశి  ,బెనారస్ .ఒక్కటే .  కాశి లో స్నానం ...ఫలం.

  కం. ౧. గంగా తరంగ డోలికా . సంగాతమ్ము నే నరుండు సంతస మొప్పన్ ,

           భంగంబు గాని భంగిమ . లింగార్చన జేయునతడు  లీలన్ శివుడౌ.

తే. గీ ,౨. గంగ మునుగంగ పాపాలు నింగి  కెగయు ,

              గంగ తాకంగ కవితలే పొంగి పొరలు .

             గంగ తలుపంగ తలపులే చెంగలించు , 

             గంగ మహిమలు తెలుపంగ ఘనులు గలరే ? 

గయ...పితృ కార్యాల గురించి

గయ...పితృ కార్యాల గురించి ..భావనలు,

 మానవజన్మ సార్ధకం అయ్యేది పితృ  ఋణము తీర్చుకున్నప్పుడే కదా ?

తే.గీ౧.పితరులెల్లరు ముక్తి సంప్రీతినంద,

          పిన్డమర్పింత్రు సత్సుతుల్ ప్రేమ మీర

          తండ్రి ఋణమును దీర్చుటే ధర్మమనుచు,

         గయనుమించిన స్థానంబు గానమనుచు.


తే.గీ౨ ఫల్గుణీతీర ప్రాంతంబు ప్రముఖమయ్యె,

         విష్ణుపాదంబు సోకిన విధమువలన

          మోక్షమబ్బుముత్తాతలకున్ లక్షణముగ,

         ఇంతకన్నను జీవికినేమివలయు ?


తే.గీ.౩.కోర్కెలన్నియు జిహ్వకుకూల్చుకొరకు,

          ఒక్కఫలమును, శాకంబు,నొక్కయాకు

          త్యాగ మొనరింత్రు గయను సద్దార్మికాళి 

          ఇష్ట పూర్తిగ మనమున స్పష్ట పరచి .


తే.గీ౪. జీవితాన్తంబు వాటిని చేరనీక,

         నియమ భంగమ్ముకానీక నిష్ట నుండి 

         సంప్ర దాయంబు పాటింత్రు సాధుజనులు, 

         వేద విదులైన సచ్చాస్త్ర వేత్త లెపుడు . 

గయ,, బుద్ధ గయ

బుద్ధ గయని చూచినప్పటి మా భావనలు ... బుద్ధుడు

 హిందూ మతము ననుసరించి విష్ణు అవతారము .

తే గి ౧.  జీవితంబున మోక్షంబు చేరు కొరకు, 

            సత్య శోధన యొక్కటే మార్గ మనుచు

           బోధి వృక్షంపు నీడన పూర్ణ భక్తి ,

           తత్వ జ్ఞానంబు నెరుగగ  తపముజేసె.

౨.         పట్టువీడని పంతాన పరమహంస,

             రూపు గాంచెను బుద్ధుడు చూపునిలిపి,

             అనిమిశున్డయ్యె  నాటితో నద్భుతముగ.

              దివ్య శక్తికి మించిన దేది కలదు ?

౩.           విష్ణు రూపుండు బుద్ధుండు వేద విదుడు, 

             ధర్మ తత్వంబు జీవికి తరచి చూపి
 
              ముక్తి మార్గంబు కల్పింప పూనుకొనియె, 

              స్వార్థ చింతన లేనట్టి సాధు మూర్తి.

పూరి జగన్నాధుని గురించి

పూరి జగన్నాధుని గురించి మా భావనలు .


తే .గీ.౧. పూరి  జగన్నాదున్డిల మోక్ష దాత ,

           భూరి సౌభాగ్య శేముషుల్ కోరుకొనిన ,


            చేరి వరముల నిచ్చు చిన్మయుండు ,

           అన్న చెల్లెలు తోడుత నమరి నాడు .


   ౨.       మూడు రధముల నూరేగు మూర్తి త్రయము . 

             తల్లి యొడి జేరి గారాలు వెల్లి విరియ


            సర్వ జనులెల్ల నీరీతి శ్రద్ధ నుండ ,

           మాతృ ప్రేమను చూపించె సూత్రధారి .


        ౩. లోక మందున మానవ లుప్తమైన, 

            సద్గుణంబుల జూపించి సౌమ్య గరిమ ,


           పూరి దివ్య స్థలంబున పుణ్య మూర్తి 

,          కృష్ణ దేవుండు వెలసే సత్క్రుపను జూపి .


  కం .౪. ఆషాడంబున పూరిన్,

           శేషాచల వాసు డెపుడు శ్రేయంబిడుచున్ ,


           పాషాణ సదృశ క్రూరుల, 

          వేషంబుల తెగడ జేసి విజ్ఞత నింపెన్ .


తే .గీ .౫. అన్నదమ్ముల అనుబంధ మన్ననిట్లు .

             సాగి పోవలె నీ రీతి శాశ్వతముగ


             దీని సూచించి యొసగెను దీవనాలి,

             జ్ఞానులకు నెపుడు సంస్తుత్య మానుడగుచు.


పూరి జగన్నాధుని రధ చక్రాలు ప్రపంచ ప్రసిధి చెందాయి.  



26, ఆగస్టు 2011, శుక్రవారం

బూతు బొమ్మల గురించి.

సూర్య దేవాలయం మీద బూతు బొమ్మల గురించి.

 ౭.తే.గి. బౌద్ధ  ధర్మంబు  లానాడు భరత భూమి, 

            ప్రజ్వ లింపగా సంతాన ప్రాప్తి లేమి ,

           బూతు బొమ్మలే ముఖ్యంపు నీతులగుచు , 

           దేవలంబున  జెక్కిరి దివ్య ప్రేమ .

౮..తే.గి. స్వచ్చ  నిర్మల ప్రేమకు స్వాగతమ్ము ,

            పల్కి శిల్పులు తమదైన ప్రజ్ఞ జూపి,

          కామకళలకు క్రొంగ్రొత్త ఖ్యాతి బెంచి ,

         వాసి గల్గు వాత్సాయన వారసులుగ.

౯.తే.గి. విశ్వ విఖ్యాతి గాంచిన విబుదు లెల్ల ,

           భరత కళలకు, కవులకు భద్ర మనుచు
 
         వేద భారత శక్తికి విస్తు పోయి ,

         అన్జలింతురు మనముల హత్తు కొనుచు.
        

కోణార్క శిల్పి



1.తే.గీ.సూర్య దేవాలయంబు సంస్తూయమాన 
          సుప్రభా భాసితంబు సుశ్లోక భరిత 
          శ్లాఖ్యదంబు, దాని గనిన సమయమందు
          జన్మ సఫలమన్ దలతురు జగమునందు.

2.కం.  కోణార్క శిల్పి యులి పా
          షాణంబుల బుజ్జగించి సరసత మెరయన్ 
          కోణాలెన్నిట జూచిన 
          ప్రాణంబుల బోసి నింపె బ్రహ్మకు దీటై.

3.కం.  ఉలి కోపమూని శిల చెవి 
          మెలివెట్టుచు కోర్కె దీర మేలిమి శిల్పాల్  
          మలచెను నర్కుని సాక్షిన్ 
          తరమే శిల్పుల బొగడ! విధాతకు నైనన్.

4.తే.గీ సూర్య తేజానకానాడు స్రుక్కిపోయి 
          తెల్లమొగముల వేసిరి తెల్లవారు 
          కొల్లగొట్టుచు శిల్పాల నెల్లవేళ
          తస్కరించి రహస్కరు ముష్కరతను.

5.తే.గీ. భాస్కర రహిత కోణార్క భాగమంత
           వెల్గుకోల్పోయి  చీకటుల్ విస్తరింప 
           కోరి చేసిరి నైచ్యంబు కూళలగుచు
           తుచ్ఛమైనట్టి యాగ్లేయ మ్లేచ్చులకట!.

6.తే.గీ. అంధకారంబు నచ్చట నణచివేసి
           శిల్పి చరితను ఘనముగా నిల్పునట్టి
           యశపుకాంతులు సతతంబు దిశలునిండె
           ఇంత కన్ననుశిల్పుల కేమివలయు?

7.తే.గీ. ఏడుగుఱ్ఱాల రథముపై నెక్కి కరుణ
           బ్రోచుచుండెడు నాభానుమూర్తి సతము
           తనదు కిరణాల ప్రసరించి ధరణినెల్ల
           కోటికాంతుల విరజిమ్ము కోర్కె దీర!



భువనేశ్వర్ కోణార్క

భువనేశ్వర్ లో లింగరాజు ఆలయం గూర్చి ..మా భావాలు.
 ౧. తే.గీ. స్నేహ బంధంబు పెరిగి మనోహరత ,  ఒరిస రాష్ట్రాన సద్భక్తి యోర్మి కలసి ,
   కాంచగల్గితి మేమప్డు కాంక్ష దీర , లింగ రాజుని సద్దయా లీల వలన .
౨.తే.గీ . శ్రీ భువనేశ్వరీ దేవి చిర్నగవున, పత్తనంబెల్ల సద్భక్తి పరవశించే                                                        లింగ రాజ దయామృత లేశమునను.మోక్ష మబ్బును నిచ్చటి పుణ్యులకును

కోణార్క సూర్య దేవాలయం గూర్చి. ....
౩. తే.గీ ..సూర్య దేవాలయంబు సంస్తూయమాన , సుప్రభా భాసితంబు సుశ్లోక భరిత ,
శ్లాఖ్యదంబు ,దాని గనిన సర్వ జనులు , జన్మ సఫలముగా దలతురు జగమునందు . 

కాశి యాత్ర అనుభవాలు.

యాత్ర కు బయలుదేరుటకు ముందు ప్రార్థన.


౧.సీ..శ్రీ రఘు రాము సంసేవనము సతము ,పాపౌఘములనెల్ల పారద్రోలు.
        శ్రీ రమకరుణ చే సిరులెల్ల నిత్యమై ,తనివార శోభిల్లు తరములెల్ల.
        భరతుని సంస్తుతిన్ భవ బంధముల్ బాసి , అహరహమ్బుల  నెల్ల ఆర్తి దొలగు. 
       లక్ష్మను ప్రేమచే లాలిత్య మొందుచు , నిలువెల్ల నెయ్యంబు నిల్చియుండు.

తే.గీ. ఆంజనేయుని సత్కృపన్ హ్లాద  మెపుడు , భక్త జనులకు కలుగంగ పాదు కొల్పి .
      యాత్ర సఫలంబుజేయంగ.నభయ మీయ.ప్రార్ధనంబును నే జేతు ప్రామ్జలిన్ఛి 
.
 యాత్రకి మార్గ దర్శి అయిన నాయుడమ్మ ని గురించి.

౨. తే.గీ .నాయుడమ్మ యనెడు నాయక రత్నమ్ము ,  యాత్ర జేయ నన్ను పాత్రు జేసే  
         వెంక టేశ్వరుండు,విజ్ఞాన  మానిసి,  మాలకొండయార్యు మమత తోడ.

25, ఆగస్టు 2011, గురువారం

కాశి యాత్ర విశేషాలు

కాశి యాత్ర విశేషాలు ...ముందుగ భువనేశ్వర్ లోని లింగరాజు ఆలయం గురించి మా భావనలు .

౧.స్నేహ బంధంబు పెరిగి మనోహరత ,  ఒరిస రాష్ట్రాన సద్భక్తి యోర్మి కలసి ,          కాంచ గల్గితి మేమెప్డు కాంక్ష దీర .లింగ రాజుని సద్డయా లీల వలన.
                                           

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...